LSG VS MI: వాట్ ఏ మ్యాచ్..ఉత్కంఠపోరులో లక్నో విజయం

నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరకు 12 పరుగుల తేడాతో ముంబయ్ మీద లక్నో గెలిచింది. 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హార్దిక్‌ సేన 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ 67 పరుగులు చేసినప్పటికీ పలితం దక్కలేదు. 

New Update
ipl

LSG VS MI

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు ముంబయ్ ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనకు దిగిన ముంబయ్ మొదటి నుంచీ బాధ్యతాయుతంగా ఆడింది. ముంబయ్ బ్యాటర్ సూర్యకుమార్ 43 బందుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ తో 67 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ నమన్ ధీర్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో చెలరేగాడు. అయితే చివర్లో సూర్య వికెట్ కోల్పోవడంతో ముంబయ్ నెమ్మదించింది. విజయానికి ఇంకా 22 పరుగులే అవసరం కాగా కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడలేదు.  లఖ్‌నవూ బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌ దీప్‌, దిగ్వేష్‌, అవేశ్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

ఔట్ అప్పీల్ చేయనందుకు మూల్యం..

మొదట బ్యాటింగ్ చేసిన లక్ నవూ దంచికొట్టింది. 20 ఓవరల్లో 203/8 పరుగులు చేయగా పవర్ ప్లే లో ఓపెనర్ మిచెల్ మార్ష్ విశ్వరూపం చూపించాడు. ఒక్కడే 60 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అయితే ఈ ఆసీస్ స్టార్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కానీ మార్ష్ ను ఔట్ చేసే అవకాశాన్ని ముంబై చేజేతులా వదులుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. దాని కారణంగా మ్యాచ్ నే పోగొట్టుకుంది. 

27 బంతుల్లో హాఫ్ సెంచరీ..

ఈ మేరకు బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్ లో ఔట్ కావాల్సిన మార్ష్ కు ముంబై అనవసరంగా అవకాశం ఇచ్చింది. నాలుగో బంతి మార్ష్ బ్యాట్ ఎడ్జ్ తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. బ్యాట్ ఎడ్జ్ తాకినా ఎవరు అప్పిల్ చేయలేదు. అల్ట్రా ఎడ్జ్ లో బ్యాట్ స్పష్టంగా తగిలినట్టు చూపించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మార్ష్.. బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మొత్తం 31బంతుల్లో 60 పరుగులు చేశాడు. చివరికి విగ్నేష్ పుత్తూరు బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. తొలి ఓవరల్ ఔట్ అయితే నాలుగు పరుగులే చేసేవాడు. కానీ ముంబై నిర్లక్ష్యం కారణంగా మార్ష్ మరో 56 పరుగులు చేయాల్సివచ్చింది.  

 

today-latest-news-in-telugu | IPL 2025 | lsg | mumbai-indians

Also Read: USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు