MI vs KKR: 116 పరుగులకే కేకేఆర్ ఆలౌట్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. మొదటి నుంచే ముంబై ఇండియన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో ఓవర్లు ఉండగానే కేకేఆర్ జట్టు ఆలౌట్ అయ్యింది.

New Update
MAtch

MAtch

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు బౌలింగ్‌ను కేకేఆర్ జట్టు తట్టుకోలేకపోయింది. ముంబై బౌలర్లు 16.2 ఓవర్లలో 116 పరుగులకే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును ఆలౌట్ చేశారు.  

రమణ్‌దీప్ సింగ్ (22), మనీశ్‌ పాండే (19), రింకు సింగ్ (17), అజింక్య రహానె (11) పరుగులు చేశారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (0)తోపాటు వెంకటేశ్‌ అయ్యర్ (3), ఆండ్రీ రస్సెల్ (5) సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ముంబయి బౌలర్లలో అశ్వని కుమార్ (4/24) అదరగొట్టాడు. దీపక్ చాహర్ 2, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్య, విఘ్నేశ్‌ పుతుర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అయితే ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 117 పరుగులు చేయాలి.

వరుస వికెట్లు..

ఇదిలా ఉండగా కేకేఆర్ జట్టు మొదటి ఓవర్‌కే వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన నాలుగో బంతికి సునీల్ నరైన్(0) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుసగా.. క్వింటన్ డి కాక్ డకౌట్ కాగా.. అజింక్య రహానే కూడా ఔట్ అయ్యాడు. మూడు ఓవర్లకే వరుసగా మూడు వికెట్లను కేకేఆర్ జట్టు కోల్పోయింది.  ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా ఔట్ అయ్యారు. చివరగా రమణదీప్ సింగ్ ఔట్ అయ్యాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు