/rtv/media/media_files/2025/04/05/w2i3AHFED5eP5SILDEv0.jpg)
rohit mi match
వరుస ఓటములతో ఐపీఎల్ లో ముంబై జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య ఐదు వికెట్లు తీసినా, ఛేజింగ్‌లో చివరి వరకు పోరాడినా జట్టుకు విజయం దక్కలేదు. ఈ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. మోకాలి గాయం కారణంగా రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్ ఆడట్లేదని టాస్ సమయంలో హార్దిక్ తెలిపాడు.
क्या Rohit Sharma का अब समय समाप्त हो गया ?जैसे कल के मैच से पहले उनको इंजर्ड कह कर टीम से बाहर कर दिया गया । क्या यह भारतीय कप्तान की के लिए बेइज़्ज़ती नहीं है उनके चहरे पर निराशा झलक रही है #MIvsLSG#RohitSharma#IPL2025pic.twitter.com/baSpyBk1lu
— Kapil Rattan Bamnia🐐 (@bamniakapil) April 5, 2025
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
సోషల్ మీడియాలో చర్చ
అయితే సోషల్ మీడియాలో మాత్రం రోహిత్‌ను ముంబై డ్రాప్ చేసిందంటూ చర్చ నడుస్తోంది. డ్రాప్డ్ అన్న హాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. జట్టుకు ఐదు కప్‌లు అందించిన ఆటగాడిని డ్రాప్ చేయడమేంటంటూ రోహిత్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండగా..మరోవైపు ఫామ్‌లో లేని రోహిత్‌ను డ్రాప్ చేసినా తప్పేంలేదంటూ ముంబై జట్టు ఫ్యాన్స్ వాదిస్తున్నారు. రోహిత్ శర్మను పక్కన పెట్టారా లేదా అన్నది తెలియాలంటే తర్వాతి మ్యాచ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో రోహిత్ వరుసగా 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు.
Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!