Manchu Manoj: మా నాన్నపై యాక్షన్ తీసుకోండి.. ఫిర్యాదు చేసిన మంచు మనోజ్
తన తండ్రి మోహన్ బాబు, ఆయన అనుచరులపై మంచు మనోజ్ పహడిషరిఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన వారి వివరాలను పోలీసులకు ఇచ్చాడు. హాస్పిటల్ రిపోర్టులను పోలీసులకు అందించాడు. మెడికల్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.