BIG BREAKING: ఎమ్మెల్యే కన్నుమూత!
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీఎంకేకు చెందిన సెంతమంగళం నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పొన్నుసామి తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
వరంగల్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం బయటపడింది. రూ.4 లక్షలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై విచారణ చేసిన ఇంటెలిజెన్స్ పోలీసులు నిజమేనని తేల్చినట్లు ప్రచారం సాగుతోంది.
MLA, MPల పీఏలకు ఓ మహిళ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పీఏల తీరుపై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. MLA, MPలను కలవాలంటే పీఏల పెత్తనం ఏంటి..? అంటూ ప్రశ్నించింది. పీఏల వల్లనే ప్రజాప్రతినిధులు ఓడిపోతున్నారంటూ మండిపడింది
కేరళలో ఎమ్మెల్యే కేపీ మోహన్ కు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఓ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను స్థానిక ప్రజలు నడిరోడ్డు మీదే చొక్కా పట్టుకుని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ శైల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే అవినీతి బండారం బయటపడింది. ఈడీ దాడుల్లో ఆయన ఇంటిలో 1.68 కోట్ల రూపాయల నగదు, 6.750 కిలోల బంగారం బయటపడింది.
ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీలో ఘర్షణ జరిగింది. ఒక ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేను కొట్టేందుకు తన సీటు నుంచి పైకి లేచి వచ్చారు. అయితే మిగతా సభ్యులు జోక్యం చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేను నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పార్టీ ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా వారి అనర్హత విషయం తేల్చాలని స్పీకర్ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.