/rtv/media/media_files/2025/10/04/kerala-mla-2025-10-04-06-24-02.jpg)
తమ నాయకులను ఓట్లు వేసి మరీ ఎన్నుకుంటారు ప్రజలు. కానీ ఒకసారి నాయకుడు అయిన తర్వాత ప్రజలనే మర్చిపోతారు . ఇది అన్ని చోట్లా జరిగేదే. భారతదేశం్లో ఉన్న ప్రజలకు ఇది చాలా అలవాటు. కానీ ఒక్కోసారి ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. తమను అస్సలు పట్టించుకోకపోతే, బాధలు పడుతున్నా గాలికి వదిలేస్తే...ఆగ్రహం కట్టలు తెచ్చుకుని వస్తుంది. అప్పుడు వారు తిరగబడతారు. కేరళలో అచ్చంగా ఇదే జరిగింది.
ఎమ్మెల్యేపై తిరగబడ్డ జనం..
కేరళలోని కన్నూర్ జిల్లా కుతుపరంపు నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడానికి వెళ్ళిన స్థానిక ఎమ్మెల్యే కేపీ మోహన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్ని సార్లు వేడుకున్నా తమ సమస్యలను తీర్చలేదనే కోపంతో అక్కడి ప్రజలు ఎమ్మెల్యేపై తిరగబడ్డారు. కేపీ మోహన్ కంటపడగానే మొత్తం అంతా ఆయనపై చూపించారు. ప్రారంభోత్పవానికి వచ్చిన ఎమ్మెల్యేను చొక్కా పట్టుకుని మరీ నడి రోడ్డు మీదే నిలదీశారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
చొక్కాపట్టుకుని గుంజి...
ఎమ్మెల్యే మోహన్ వస్తున్న సంగతి అక్కడి ప్రజలు ముందుగానే తెలుసుకున్నారు. దీంతో వాళ్ళు అన్నింటికీ ప్రిపేర్ అయ్యే వచ్చారు. తమ నిరసనను తెలపాలని డిసైడ్ అయ్యారు. ఎమ్మెల్యే వస్తుంటే ప్లకార్డులతో ప్రారంభోత్సవం ప్రాంతానికి చేరుకుని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నావారిని తోసుకుంటూ వెళ్లి ఎమ్మెల్యే మోహన్ పై తిరగబడ్డారు. చాలాసేపటి వరకు ఆయనను వదిలిపెట్టలేదు. చివరకు పోలీసులు ఎలాగోలా ఎమ్మెల్యేను అక్కడి నుంచి తప్పించారు. కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం తెగ వైరల్ అయిపోయింది.
"Protesters Confront Koothuparamba MLA KP Mohanan Over Drinking Water Contamination at Kariyad; Police Register Case Against 25 for Unlawful Assembly"#Koothuparamba#kpmohanan#peopleprotestpic.twitter.com/lcAMzBCdzO
— @Vinod Fattepur (@ChalavadiVinod) October 3, 2025
కన్నూరులో స్థానికంగా ఉన్న డయాలసిస్ కేంద్రంలో పేరుకుపోయిన చెత్తను తొలగించిన ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోలేదు. దాంతో ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఆయనా పట్టించుకోలేదు. ఇదే కోపాన్ని వాళ్ళు ఎమ్మెల్యే వచ్చినప్పుడు చూపించారు. స్థానిక డయాలసిస్ కేంద్రంలో శుద్ధి చేయని వ్యర్థాలను బహిరంగంగా పడేస్తున్నారని.. దీనివల్ల తమ ప్రాంతంలోని భూగర్భ జలాలు విషపూరితం అయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే మోహన్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు.