Jubilee Hills by-election : కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అయింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.

New Update
dea

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అయింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా అనధికారికంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఈ చర్యలు తీసుకున్నారు. 

పోలింగ్ జరుగుతున్న సమయంలో స్థానికేతర ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రాల వద్ద అనధికారికంగా గుమిగూడటం, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కర్ణన్ స్పష్టం చేశారు. కోడ్‌ను ఉల్లంఘించిన కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించామని, వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగిందని డీఈఓ తెలిపారు.  

మాగంటి సునీత ఆరోపణలు 

మరోవైపు తమ పార్టీ కార్యకర్తలపై కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ దాడులు చేస్తున్నారని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత పోలీసులదేనని అన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోనున్న 4,01,365 ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్‌ బీఆర్ఎస్ నుంచి సునీత,బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు.ఉదయం 11గంటల వరకు 20.76 శాతం పోలింగ్‌ నమోదైంది.139 ప్రాంతాల్లో 407 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విధుల్లో 5 వేల మంది సిబ్బంది ఉన్నారు. పోలింగ్‌కు 1,761 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంది. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల ఉపయోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు