/rtv/media/media_files/2025/10/19/common-woman-2025-10-19-13-26-06.jpg)
Common Woman
Common Woman : అప్పటివరకు చిన్నపాటి లీడర్‌గా ఉన్న వ్యక్తి అదృష్ట కలిసి వచ్చి ప్రజలు ఆధారిస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో అవుతాడు. అలా కాగానే సామాన్యులకు అందుబాటులో ఉండకుండా పోతాడు. అంతేకాదు కనీసం ఫోన్ కూడా ఎత్తరు. వారి పనులు చేసి పెట్టడానికి పీఏలను పెట్టుకుంటారు. అప్పటి నుంచి ప్రతి చిన్నవిషయానికి పీఏలో సమాధానం ఇస్తుంటారు. ఒక్కోసారి ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే వారే నిర్ణయం తీసుకుని ప్రజలను కలవనివ్వరు. అలాంటపుడు సామాన్యులకు కడుపు మండటం కామన్. అలాంటిదే ఓ మహిళకు కడుపు మండి ఓ వీడియోను సోషల్ మీడియాలో లిలీజ్ చేసింది. ఇప్పుడది వైరల్‌గా మారింది. అసలు ఆ వీడియోలో ఏముందంటే?
MLA, MPల పీఏలకు ఓ మహిళ మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పీఏల తీరుపై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. MLA, MPలను కలవాలంటే పీఏల పెత్తనం ఏంటి..? అంటూ ప్రశ్నించింది.ఎడమకాలు చెప్పు తీసి పీఏలను కొట్టాలి. నడిరోడ్డుపై పీఏలను బట్టలూడదీసి తగులబెట్టాలి. పీఏల వల్లనే ప్రజాప్రతినిధులు ఓడిపోతున్నారంటూ మండిపడింది.ఏ పార్టీ ప్రజాప్రతినిధులు అయినా పీఏలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఓట్లు వేస్తేనే గెలవలేదని ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచారని ఆమె స్పష్టం చేశారు. కానీ ప్రజలకు ఏమైనా కష్టం వచ్చిందని వెళితే పీఏలు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
---పాకిస్తాన్ కంటే పీఏలు డేంజర్ అంటూ, పీఏలు చెప్తే సీఎంలు ఆగిపోతరు.నేను సీఎం అయితే పీఏలను బట్టలూడదీసి తగులబెడుతా అంటూ ఫైర్ అయింది. మీ కుటుంబ సభ్యుల అపాయింట్మెంట్లు అడగట్లేదు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన నాయకుల అపాయింట్ మెంట్లు అడిగితే ఎందుకు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాప్రతినిధులను ప్రజలు కలిస్తే పీఏలకు ఏం నొప్పి..? అంటూ ప్రశ్నించింది. పీఏల భార్యలు అపాయింట్మెంట్ అడిగామా..? నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రజలను కలవకుండా పీకనీకి ఉన్నడా..? ప్రజలను కలవలేనంత బిజీగా ఎమ్మెల్యే ఉంటాడా..? అంటూ విరుచుకు పడింది. పర్సనల్ పనులు చేసుకునేందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతి చేసే పీఏలను చెప్పుతో కొట్టాలి అంటూ ఆమె వీడియోలో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె కామెంట్లను నెటిజన్లు కూడా సమర్థిస్తున్నారు. చాలామంది తమకు ఎమ్మెల్యేల పీఏలతో ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.
Also Read : 9,600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. నేలకు కొట్టి, నీటిలో వేసినా ఏం కాదు..!