Minister Seethakka : సోషల్‌మీడియా నన్ను మానసికంగా దెబ్బతీసింది..మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పడ్డాను.నాపై పెట్టిన పోస్టులకు నేను మానసికంగా,చాలా ధైర్యం కోల్పోయానని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి...కానీ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేయద్దని అన్నారు.

New Update
Minister Seethakka

Minister Seethakka

 Minister Seethakka : సోషల్ మీడియా ద్వారా నేను చాలా ఇబ్బంది పడ్డాను.నాపై పెట్టిన పోస్టులకు నేను మానసికంగా,చాలా ధైర్యం కోల్పోయానని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీతక్క ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాలి...కానీ సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం ఏంటి ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేయకూడదని, సోషల్ మీడియాకి  హద్దు ఉండాలన్నారు. సోషల్ మీడియా సిన్సియర్ గా వర్క్ చేసే మహిళల ధైర్యాన్ని దెబ్బతీస్తుందని సీతక్క అభిప్రాయపడ్డారు.

Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!

Also Read: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

సోషల్ సర్వీస్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయాలి కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా ద్వారా లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బీఆర్‌ఎస్‌ సీతక్క అన్నారు.అబద్ధాన్ని వంద సార్లు చెపితే నిజం అవుతుందని బీఆర్‌ఎస్‌ నమ్ముతుందన్నారు. సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌, బీజేపీ అన్నదమ్ములని సీతక్క విమర్శించారు. ఒక మంచి పని చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తే దాన్ని చూసి  స్ఫూర్తిగా తీసుకుని మరొక పది మంది బయట వచ్చి సహాయం చేసే లాగా ఉండాలని ఆమె సూచించారు. అంతేకానీ మానసిక ధైర్యాన్ని దెబ్బతీయరాదని అన్నారు.సోషల్‌ మీడియా కట్టడికి ఒక చట్టం తీసుకు రావలసిన అవసరం ఉందని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. ఇక సీఎం రేవంత్‌ రెడ్డి మార్చురీ అని ఒక వ్యక్తిని గురించి అన్న విషయం కాదని ఒక పార్టీ ని మాత్రమే అన్నారని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisment