Seethakka: ఎన్‌కౌంటర్లు రాజ్యాంగ విరుద్ధం.. వాళ్లతో నాకు పేగు బంధం ఉంది: సీతక్క ఎమోషనల్!
ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల అంశంపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్లు చేయొద్దని కోరారు. ఆదివాసులతో తనకు పేగు బంధం ఉందని, వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని RTV వేదికగా డిమాండ్ చేశారు.
Seethakka: ఆపరేషన్ కగార్, బచావో కర్రెగుట్టల అంశంపై మంత్రి సీతక్క ఎమోషనల్ అయ్యారు. రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ఎన్‌కౌంటర్లు చేయొద్దని కోరారు. ఆదివాసులతో తనకు పేగు బంధం ఉందని, వెంటనే పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
దోపిడి, వివక్ష మీదనే వారి పోరాటం..
ఈ మేరకు RTVకి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నక్సల్స్ ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం, కొమురం భీం, వంటి పోరాటాలన్నీ ఆదివాసుల నైజాంగా పేర్కొన్నారు. ఆనాడు బ్రిటీష్, రాజులకు ఇప్పుడు నియంతపాలనకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాడుతూనే ఉన్నారని అన్నారు. వారి డిమాండ్లు, పోరాటం మొత్తం.. దోపిడి, వివక్ష, అన్యాయం మీదనే ఉంటుందని, ఉద్యమాలు స్థానిక సమస్యల మీద పురుడుపోసుకుంటాయని చెప్పారు.
అటవీమీద వారికి హక్కు ఉంది..
మావోయిస్టులు శాంతి చర్చలకు అంగీకరించారు. వారు మన దేశ పౌరులే కాబట్టి, రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమస్య లేకుండా శాంతి యుతంగా వారిని జనజీవన స్రవంతిలోకి తీసురావాలన్నారు. కర్రెగుట్టలపై ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారని, పోలీసుల చర్యతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తునికాకు కోసుకుంటేనే వారికి ఆదాయం. ఇది ఇప్పపువ్వు సీజన్. అదే వారి జీవనాధారం. కానీ పోలీసులు మోహరించడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి అటవీ ఉత్పత్తులమీద హక్కు ఉంది. కాబట్టి బలగాలు వెంటనే అక్కడినుంచి వచ్చేయాలని ఒక ఆదివాసి బిడ్డగా కోరుతున్నట్లు చెప్పారు.
నాకు పేగు బంధం ఉంది..
శాంతి చర్చల కమిటీతో ప్రజల హక్కుల గురించి చర్చించాం. ఆదివాసుల భయాందోళనలో బతుకుతున్నారు. నీటి కుంటల్లో చేపలు తిని బతుకుతారు. తునికాకు తెచ్చుకుని తింటారు. అందుకే వారి జీవన విధానం గురించి ఆలోచించాలి. ఉద్యమ సిద్ధాంతం మరిచిపోయాం. కానీ ఆదివాసిలతో పేగు బంధం ఉంది. ఆ జీవితం నుంచి వచ్చిన నాకు బాగా తెలుసు. అడవిలో ఎవరు ఉండమన్నారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ వందల ఏళ్లుగా అక్కడే బతుకుతున్నాం. ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం. హింసకు హింసతోనే పరిష్కారం అంటే ప్రజలు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారు అన్నారు.
చంపడం రాజ్యాంగానికి విరుద్ధం..
పనిగట్టుకుని మన పౌరులను చంపడం సరైనది కాదు. రాజ్యాంగానికి విరుద్ధం. తెలంగాణ బిడ్డలకు ఉద్యమాలతో అనుబంధం ఉంది. ప్రతి ఊరులో జాతరలా ఉద్యమాలు జరిగాయి. భూములు, ఇండ్లు, తదితర పంచాయితీలను మావోయిస్టు పార్టీ పరిష్కరించింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా వారు ఆయుధాలు విడనాడాలి. శాంతియుత వాతావరణాన్ని కల్పించి.. హింస లేకుండా చేసుకుంటే బాగుంటుంది. హింస హింసతో పరిష్కారం కాదు. బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మావోయిస్టులను చంపాలని చెప్పడం రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నారు. వారేమీ టెర్రరిస్టులు కాదు.. ఉగ్రవాదులు కాదు. 50 ఏళ్ల నుంచి ఉద్యమంలో పనిచేసిన వారు. వారి డిమాండ్లు అన్నీ న్యాయమైనవే. ఆదివాసులను ఇబ్బంది పెట్టకుండా చర్చలు జరపాలి. పోలీసులు, మావోయిస్టుల గొడవల్లో ఆదివాసి బిడ్డలు, ముఖ్యంగా మహిళలు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలి..
రాష్ట్రపతి కూడా ఆదివాసి బిడ్డనే కాబట్టి దీనిపై ఆలోచించాలని సీతక్క కోరారు. ప్రజాసంఘాలు, మేధావులు, ఆదివాసి సంఘాలు మాకు లేఖలు ఇస్తు్న్నారు. కాబట్టి అవన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం చర్చలకు అవకాశం ఇస్తే బాగుంటుందని అన్నారు. వారిని జనాల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు. కేశవరావు, జనారెడ్డి సూచలన మేరకు నిర్ణయం తీసుకుంటాం అని ఆమె చెప్పారు. ఆదివాసులకు అండగా నిలబడుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు సీతక్క. బీజేపీ శత్రు వైఖరి వీడనాడి స్నేహపూరితమైన ధోరణి అనుసరించాలన్నారు. కర్రెగుట్టలనుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి ఇంటర్వ్యూ కింది వీడియోలో చూడండి.

minister-seethakka | maoist | karregutta | bjp | telugu-news | today telugu news