/rtv/media/media_files/2026/02/10/mahadevappa-2026-02-10-12-29-27.jpg)
mahadevappa
తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా ముక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా.. సోమవారం రాత్రి మహాదేవప్ప ముక్తల్ మున్సిపాలిటీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మహాదేవప్ప కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రత్యర్థుల వేధింపుల వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
బ్రేకింగ్ న్యూస్
— TNews Telugu (@TNewsTelugu) February 10, 2026
మక్తల్ మున్సిపల్ 6వ వార్డు ఎన్నిక వాయిదా
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో వాయిదా వేసిన ఎన్నికల సంఘం https://t.co/0Isw3Jyqbh
ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆత్మహత్య చేసుకోవడంతో..
ఎన్నికలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేపుతోంది. మహాదేవప్ప తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడా? లేకపోతే ప్రత్యర్థులు చేయించారా? ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న మంత్రి శ్రీహరి, ఆయన అనుచరుల వేధింపులు తట్టుకోలేకే బీజేపీ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వెంటనే ఇతన్ని అరెస్టు చేయాలని మహాదేవప్ప కుటుంబ సభ్యులతో పాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us