/rtv/media/media_files/2025/10/20/hen-2025-10-20-11-47-41.jpg)
మహబూబ్ నగర్ జిల్లాలో సినిమా తరహాలో కోడి దొంగతనం జరిగింది. ఇద్దరు స్కూటర్ పై వచ్చి ఒక చిన్న అమ్మాయిని బెదిరించి ఆమె కోడిని దొంగిలించారు. ఈ సంఘటనంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీంతో ఈ వ్యవహారం ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాలలో గోపాల్ అనే వ్యక్తి స్థానికంగా గొర్రెలను మోపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అంతేకాకుండా ప్రత్యేక బ్రీడ్ కలిగిన కోళ్లను కూడా పెంచుకుంటున్నాడు. అవి నిర్ణీత బరువుకు చేరుకోగానే వాటిని అమ్మేవాడు. ఈ క్రమంలోశనివారం గోపాల్ తన భార్య గొర్రెలను మేపేందుకు వెళ్లగా ఇంటి వద్ద కూతురును కాపలాగా పెట్టారు. అయితే దంపతులిద్దరూ సాయంత్రం ఇంటికి రాగానే వారి కుమార్తే వారికి షాకింగ్ విషయం చెప్పింది. మధ్యాహ్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బెదిరించి ఓ కోడిని ఎత్తుకెళ్లారని తెలిపింది.
సీసీ ఫుటేజ్‌ని పరిశీలించగా
దీంతో వెంటనే గోపాల్.. సీసీ ఫుటేజ్‌ని పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బెదిరించి కోడిని దొంగిలించినట్లుగా రికార్డయింది. వెంటనే గోపాల్ జడ్చర్ల పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగిలించిన కోడిని దొంగలు అదే ప్రాంతంలో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికలు గోపాల్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లిన గోపాల్.. స్థానికుల సహాయంతో వారిని పట్టుకున్నాడు.
దొంగిలించిన తన కోడితో పాటు, వారి స్కూటీని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. దొంగలు తాము తప్పు చేశామని మమ్మల్ని వదిలేయాలని ఫ్రాదేయపడ్డారు. మరోసారి ఇలాంటి పనులు చేయమని బాధితుడి కాళ్లావేళ్లా పడ్డారు. దీంతో కనికరించిన గోపాల్ వారిని వదిలేయమని పోలీసులను కోరాడు. పోలీసులు సైతం ఇద్దరు నిందితులకు తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇక స్వాధీనం చేసుకున్న కోడిని గోపాల్‌కు ఇచ్చేశారు. బాధితుడు కోడితో సహా పోలీస్ స్టేషన్ లో అటు, ఇటు తీరుగుతుండడంతో అక్కడ ఉన్నవాళ్లను కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది.
Follow Us