BIG BREAKING : కవిత సంచలనం.. ఆ మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేసిన జాగృతి!

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్,  బీజేపీలకు షాక్ ఇస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జయకేతనం ఎగురవేసింది. తె

New Update
kavitha

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్,  బీజేపీలకు షాక్ ఇస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత మద్దతుతో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ఇక్కడ ప్రభంజనం సృష్టించారు.

వడ్డేపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 10 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు చూస్తే..  ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (జాగృతి): అభ్యర్థులు 08 వార్డు్ల్లో విజయం సాధించగా..  కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో వార్డుల్లో విజయం సాధించాయి. మొత్తం 10 స్థానాలకు గానూ 8 చోట్ల స్వతంత్రంగా (ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై) పోటీ చేసిన జాగృతి అభ్యర్థులే విజయం సాధించడంతో వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆ పార్టీ ఏకపక్షంగా దక్కించుకుంది. 

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే, వడ్డేపల్లిలో మాత్రం స్థానిక ప్రజలు జాగృతి అభ్యర్థులకే పట్టం కట్టారు. ఈ విజయంతో వడ్డేపల్లి పట్టణంలో సింహం గుర్తు జెండాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు