Telangana: మహబూబ్ నగర్ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. చీరాల బీచ్‌కు అభ్యర్థుల బృందం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభ్యర్థుల్లో మేయర్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత మూడు ఏసీ బస్సుల్లో అభ్యర్థుల బృందం ఏపీలోని బాపట్ జిల్లా చీరాల తీరానికి చేరుకుంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Political Heat Rises in Mahbubnagar Mayor Seat

Political Heat Rises in Mahbubnagar Mayor Seat

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభ్యర్థుల్లో మేయర్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత మూడు ఏసీ బస్సుల్లో అభ్యర్థుల బృందం ఏపీలోని బాపట్ జిల్లా చీరాల తీరానికి చేరుకుంది. 29 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ అక్కడ ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌కు తరలించినట్లు తెలుస్తోంది. 

Also Read: మహారాష్ట్రలో కీలక పరిణామం.. NCP విలీనం ఉండదన్న సంజయ్ రౌత్

ప్రస్తుతం చీరాలలోని ఓ రిసార్ట్ వద్ద పార్టీ ముఖ్య నేతలు పహారా కాస్తున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మహబూబ్‌నగర్ మేయర్ పేరు ప్రకటిస్తే రిసార్ట్‌లోనే అసమ్మతి గ్రూపులు ఏర్పడుతాయనే భయంతో నేతలు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. 

Also Read: మున్సిపల్‌ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎంతశాతం ఓట్లు వచ్చాయంటే?

తమ ఓటుతో గెలిచిన కార్పొరేటర్లు ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరానికి చేరడంతో మహబూబ్‌నగర్ ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. చీరాల నుంచి అభ్యర్థులు తిరిగి ఎప్పుడు వస్తారు? మేయర్ పదవి ఎవరికి వస్తుంది అనేదానిపై చర్చ నడుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు