Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే

ప్రధాని మోదీ బుధవారం కుంభమేళా వేడుకలో పాల్గొనున్నట్లు ఓ ఐపీఎస్ అధికారి తెలిపారు. ఉదయం11 - 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారిస్తారని పేర్కొన్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చదవండి.

author-image
By B Aravind
New Update
PM Modi to Visit Maha Kumbh

PM Modi to Visit Maha Kumbh

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న రానున్నట్లు తెలుస్తోంది. త్రివేణీ సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రధాని మోదీ షెడ్యూల్ గురించి చెప్పినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. '' బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 

Also Read: జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం.. బంగారు పతకాలు అమ్ముకున్న డైరెక్టర్!

అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్‌కు వెళ్తారు. ఆ తర్వాత ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళాకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల మధ్య సమయంలో త్రివేణీ సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరిస్తారు.  11.45 కి బోటులో తిరిగి అరైల్‌ ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఢిల్లీకి పయనమవుతారని'' ఐపీఎస్ అధికారి చెప్పినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.   

Also Read: వందల కోట్ల విలువైన 30 లగ్జరీ కార్లు.. ఎందుకు సీజ్ చేశారో తెలుసా?

ఇదిలాఉండగా.. మహా కుంభమేళా ప్రారంభానికి ముందే ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ రూ.5,500 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికీ శంకుస్థాపనలు చేశారు. మహా కుంభమేలా ఈ ఏడాది జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇప్పటివరకు ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లకు పైగా భక్తులు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. 

Also Read: తెలంగాణ కులగణన సర్వేపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు