/rtv/media/media_files/2025/02/02/xvqcYmnTHBvknJrqec7m.jpg)
maha kumbh 2025
Maha Kumbh 2025: అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళ ఉత్సవాలు ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో అట్టహాసంగా జరుగుతున్నాయి. మూడు పుణ్య నదుల కలయిక అయిన ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కోట్ల సంఖ్యల్లో భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళాలో అయోధ్య రామ మందిరం రిప్లికా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుంభమేళకు వచ్చిన భక్తుల కళ్ళనీ ఆ రామ మందిరం ప్రతిరూపాన్నే ఆకర్షిస్తున్నాయి. అచ్చం అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకున్న అనుభూతి కలిగేలా ఈ ప్రతిరూపాన్ని నిర్మించారు.
/rtv/media/media_files/2025/02/02/9LQTm6EP0n9MOWrkr34P.jpg)
కుంభమేళాలో రామ మందిరం ప్రతిరూపం..
ప్రముఖ తెలుగు కళాకారుడు రమణ వంక త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో చుంగ్లీ అనే ప్రదేశంలో కుంభమేళకు వచ్చిన భక్తుల కోసం అచ్చం అయోధ్యను తలపించేలా రామ మందిరం నమూనాను నిర్మించారు. 16,800 చదరపు అడుగుల విస్తీర్ణం, 140 అడుగుల పొడవు, 120 అడుగుల వెడల్పుతో మందిరాన్ని కట్టారు. దీని కోసం వెదురు కర్రలు, వస్త్రాలు, ఫోమ్ మెటి రియల్, ఫైబర్‌ను ఉపయోగించారు. గర్భగుడిలో కూడా అచ్చం అయోధ్యలో మాదిరిగానే బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
నిత్యం 20 వేలమంది భక్తులు ఈ మందిరాన్ని దర్శించుకుంటున్నారు. డిసెంబర్ 29న ప్రత్యేక పూజలతో రామ మందిరాన్ని తెరిచినట్లు తెలిపారు. భక్తుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో అయోధ్య రామమందిర ప్రతిరూపాన్ని నిర్మించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు కళాకారుడు రమణ చెప్పారు. 25 రోజుల్లో ఈ నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు వివరించారు. కుంభమేళకు వచ్చి.. అయోధ్య రాముడిని దర్శించుకోలేకపోతున్న భక్తుల కోసం ఈ రామ మందిరం ప్రతిరూపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
Also Read: Tirumala Laddu: ఇంత దారుణమా! లడ్డూ వివాదం పై పవన్ హీరోయిన్ ఆగ్రహం