/rtv/media/media_files/2025/01/31/5NYyXY5hKJPp9G0kDAps.jpg)
Police Dumping Soil In Food Vessel
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తున్నారు. దీంతో కొన్ని స్వచ్చంధ సంస్థలు వారికి ఆహారాన్ని సరఫరా చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ పోలీస్ అధికారి అక్కడ ప్రవర్తించిన తీరు అందరిని నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఓచోట పలువురు ఆహారం వండుతుండగా... ఆ పోలీస్ అధికారి దానిలో మట్టి పోశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?
ప్రయాగ్‌రాజ్‌లో ఆహారాన్ని వండే భండారా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటుకల పొయ్యిపై రెండు పెద్ద పాత్రల్లో కొందరు ఆహారం వండుతున్నారు. ఇంతలోనే ఓ పోలిస్ అధికారి అక్కడికి వచ్చాడు. అక్కడ వండుతున్న ఓ ఆహార పాత్రలో మట్టి పోశాడు. అయితే ఇలా ఎందుకు చేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. కానీ దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ये दुर्भाग्यपूर्ण है कि जो लोग महाकुंभ में फँसे लोगों के लिए भोजन-पानी की व्यवस्था कर रहे है उनके सद्प्रयासों के ऊपर राजनीतिक विद्वेषवश मिट्टी डाल दी जा रही है।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 30, 2025
जनता संज्ञान ले! pic.twitter.com/LTwwKbBwO5
Also Read: సిరియా పై విరుచుకుపడిన అమెరికా..మోస్ట్ వాటెండ్ సీనియర్ ఉగ్రవాది హతం!
అయితే ఆ పోలీస్ అధికారిని సోరాన్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి బ్రిజేష్ తివారిగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. మరోవైపు విపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. మహ కుంభమేళాలో చిక్కుకున్న వాళ్లకి ఆహారం, నీళ్లు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ శత్రుత్వం కారణంగా విఫలమవ్వడం దురుదృష్టకరమన్నారు. దీన్ని ప్రజలు గమనించాలని రాసుకొచ్చారు.