Maha Kumbh 2025: మహా కుంభమేళాకు ఇప్పటిదాకా 33 కోట్ల మంది

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 వరకు కుంభమేళాలలో 33 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది.

New Update
Maha Kumbh 2025

Maha Kumbh 2025 Photograph: (Maha Kumbh 2025)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 13న ప్రారంభమైన ఈ కార్యక్రమానికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే అప్పటినుంచి నుంచి ఫిబ్రవరి 1 వరకు కుంభమేళాలలో 33 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. శనివారం 2.15 కోట్ల మంది రాగా.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు 90 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  

Also Read: ఇదేం ట్విస్టురా మామా.. ఆ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని పెళ్లి క్యాన్సిల్‌

అయితే వసంత పంచమిని సందర్భంగా సోమవారం 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖులు కూడా వస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా అక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ కుంభమేళాకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.   

Also Read: ఆ బాలీవుడ్ నటుడికి ఫిదా అయిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?

ఇదిలాఉండగా.. ఇటీవల మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. దీంతో యోగీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేదుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్‌లను కూడా రంగంలోకి దింపింది. జనవరి 13న మొదలైన కుంభమేళా.. ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కలను చూస్తుంటే 40 కోట్ల దాటే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్‌ సర్వేలో సంచలన విషయాలు

Also Read: తెలంగాణలో బీసీల శాతం ఎంతంటే ?.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు