CM Revanth Reddy : మీరు మాట్లాడరా ... మంత్రులపై సీఎం రేవంత్ సీరియస్!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి..  మంత్రులు, పార్టీ కీలక నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

New Update
cm revanth reddy

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)..  మంత్రులు, పార్టీ కీలక నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని, అంతా తానై సమాధానం చెప్పాల్సి వస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం..  మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మంత్రులపై(congress cabinet ministers) అసహనానికి గురయ్యారని సమాచారం. 

Also Read :  సిట్‌ విచారణతో డైవర్షన్ గేమ్.. దివాలా తీసిన సంస్థకు రూ.6వేల కోట్లు

మీరెవరూ నోరు మెదపరా?

విపక్షాలు నాపై మాటల దాడి చేస్తుంటే మీరెవరూ నోరు మెదపరా? ప్రతిదానికీ నేనే ముందుండి సమాధానం చెప్పాలా? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?" అంటూ ఆయన నేరుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమీక్షలో కొందరు మంత్రులు రహస్యంగా భేటీ కావడంపై కూడా సీఎం ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. 

ముఖ్యంగా ప్రభుత్వ రహస్యాలు, కీలక నిర్ణయాలు బీఆర్ఎస్ నేతలకు ముందే ఎలా తెలుస్తున్నాయన్న అంశంపై రేవంత్ సీరియస్ అయ్యారని పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది. సొంత పార్టీలోనే కోవర్టులు ఉన్నారా అనే కోణంలో కూడా సీఎం రేవంత్ ఆరా తీసినట్లుగా సమాచారం.

Also Read :  బీసీ రాగమెత్తిన రాజకీయ పార్టీలు.. మున్సిపాల్‌ ఎన్నికల్లో వారికే పెద్ద పీట

కాన్వాయ్‌పై దాడి జరగడంపై

మేడారం జాతరలో మంత్రుల కాన్వాయ్‌పై దాడి జరగడంపై కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అసలు ఆ దాడికి దారితీసిన పరిస్థితులు ఏంటి? నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల విషయంలో నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అలసత్వాన్ని వీడకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు.  ఈ ఎన్నికల్లో విజయంపై నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని వారికి సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 

కాగా రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలతోపాటు పలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందిsho.  

Advertisment
తాజా కథనాలు