ఆంధ్రప్రదేశ్ కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. యువకుడి ఇంటిపై తల్లిదండ్రుల దాడి ప్రకాశం జిల్లాలో దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ కూతురు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లి పోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ యువకుడి కుటుంబ సభ్యులకు దాడికి పాల్పడ్డారు. తల్లిని కొట్టి, ఆ తర్వాత సోదరి బట్టలు చింపి అమానుషంగా పెట్రోల్ పోసి.. చంపేస్తామని బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం, కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. By E. Chinni 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సైకో టైమ్ అయిపోయింది.. నా ఉగ్రరూపం చూపిస్తా: చంద్రబాబు సైకో టైమ్ అయిపోయిందని.. వైసీపీ నేతలకు నా ఉగ్రరూపం చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఆదివారం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరుకు వచ్చారు చంద్రబాబు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సైకో ఓడిపోతాడని, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి.. జగన్ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం తగ్గిపోయిందని.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మెదక్ ప్రజా గాయకుడు గద్దర్ మరణానికి కారణం అదేనా? వైద్యులు ఏం చెప్పారంటే!! రెండు రోజుల క్రితమే ఆయనకు జరిగిన గుండె ఆపరేషన్ జరిగి విజయవంతం అయిందని... కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి గద్దర్ అనారోగ్యంగా ఫీల్ అయ్యారని, బీపీతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ బీపీ, షుగర్ కారణంగా శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతిన్నాయి. దీంతో గద్దర్ ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నందిగామలో కేశినేని నాని భారీ ర్యాలీ.. దూరంగా మాజీ ఎమ్మెల్యే తాజాగా నందిగామలో కార్యకర్తలతో కేశినేని నాని భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కేశినేని నానికి ధీటుగా చిన్ని వర్గీయులు కూడా పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య దూరం మరింత పెరిగింది. కేశినేని నాని నందిగామ నియోజకవర్గ పర్యటనకు హాజరు కాని మాజీ ఎమ్మెల్యే సౌమ్య... By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మోడీ నాయకత్వంలోనే ఇండియన్ రైల్వే అభివృద్ధి: కిషన్ రెడ్డి 2014 నుంచి 2023కి రైల్వే శాఖ బడ్జెట్ కు 17రేట్లు పెరిగిందన్నారు. రైల్వే అభివృద్ధి కోసం 30వేల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 20వేల కోట్ల నిధులు రైల్వే పనుల కోసం కేంద్రం ఖర్చు చేసిందని, 122 కిలో మీటర్ల కొత్త రైల్ లైన్స్ నిర్మించిందని చెప్పారు. 2023 పూర్తి అయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ ను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని.. By E. Chinni 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో భూకంపం..భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం..!! ఢిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 9.34 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూకుష్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 15 సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. By Bhoomi 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'చంద్రముఖి-2' నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్ తాజాగా శనివారం బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో కంగనా ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రముఖి-2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు.. By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరదలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. విమర్శలకు తావులేకుండా చూడాలి.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నామని అన్నారు సీఎం. టీఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నానని తెలిపారు. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా.. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఈ నెల 10 నుంచి విశాఖలో పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' ఇప్పుడు అందరి చూపు పవన్ కల్యాణ్ పై ఉంది. మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో వైసీపీకి వణుకు పుట్టించిన పవన్ మూడో విడత యాత్రలో ఏం చేయబోతున్నారు? ఎలాంటి మెరుపులు మెరిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn