/rtv/media/media_files/2025/12/05/backpain-and-pregnancy-2025-12-05-14-44-46.jpg)
backpain and pregnancy
నేటి కాలంలో మహిళలు అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బయట ఆహారాలు తినటం, జంక్ పుండ్ వంటి ఎక్కువ ప్రభావం చూపుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో అయితే కొందరి మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వాళ్లో వెన్నునొప్పి ఒకటి. ఈ సమస్య సాధారణ మహిళలను సంవత్సరాలుగా వేధిస్తు ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఇన్‌స్టాగ్రామ్, గుగుల్‌లో, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వంటి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు దిగువ వీపు (Lower Back) కట్టే పట్టీలు కూడా వాడుతార. బిడ్డకు జన్మించిన తర్వాత ఈ నొప్పి ఎక్కువగా మొదలైందట. కొందరికి చాలా చికిత్సలు ప్రయత్నించినా ప్రయోజనం ఉండక భావోద్వేగానికి గురైతారు. అయితే మ్యూస్ స్టెమ్ సెల్ థెరపీ (Muse Stem Cell Therapy) అనేది దెబ్బతిన్న కణజాలాలను (Damaged Tissues) రిపేర్ చేయడానికి శరీరంలో సహజంగా ఉండే కణాలను ఉపయోగించే చికిత్సతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. మ్యూస్ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమిటి..? దాని వల్ల ఉపయోగాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మ్యూస్ స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమిటి?
స్పెషల్ సెల్స్ (Muse Cells): ఈ కణాలు ఎముక మజ్జ (Bone Marrow), ఇతర కణజాలాలలో కనిపిస్తాయి. ఇవి ప్లూరిపోటెన్సీ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. అంటే అవి శరీరంలోని వివిధ రకాల కణాలుగా మారగలవు. కణజాలం దెబ్బతిన్నప్పుడు శరీరం పంపే SOS సిగ్నల్స్‌కు ప్రతిస్పందనగా.. ఈ కణాలు ప్రభావిత ప్రాంతానికి తరలివెళ్లి.. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త, ఆరోగ్యకరమైన కణాలుగా మారి మరమ్మత్తును ప్రారంభిస్తాయి. భుజం నొప్పికి, దీర్ఘకాలిక వెన్నునొప్పికి ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతుంది.
చికిత్సకు చట్టపరమైన-వైద్యపరమైన హెచ్చరిక:
FDA కొన్ని స్టెమ్ సెల్ చికిత్సలను కేవలం రక్త రుగ్మతలు (Blood Disorders) ఉన్నవారికి మాత్రమే ఆమోదించింది. దీర్ఘకాలిక వెన్నునొప్పి వంటి పరిస్థితులకు స్టెమ్ సెల్ థెరపీ యొక్క భద్రత, సమర్థతపై ఇంకా పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కొంతమంది నిపుణులు ఇది వాపును తగ్గించడంలో.. కణజాల పునరుత్పత్తిలో ఆశాజనకంగా ఉందని భావించినప్పటికీ.. ఇది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందని, ప్రామాణిక చికిత్సగా పరిగణించబడలేదని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ లక్షణాలు మీ ఒంటిలో కనిపిస్తే మీ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లే!!
అయితే ఈ విషయం ఎవరికైనా ఇది సహాయపడవచ్చు. అయితే మీరు ఏదైనా వైద్య చికిత్సను పరిశీలించే ముందు సరిగ్గా పరిశోధన చేయాలి, వైద్యులను సంప్రదించాలని కొందరూ స్పష్టం చేశారు. వెన్నునొప్పికి స్టెమ్ సెల్ థెరపీ అనేది పునరుత్పత్తి వైద్యంలో (Regenerative Medicine) ఒక ఆశాజనకమైన రంగం. దీర్ఘకాలిక వెన్నునొప్పికి ప్రధాన కారణమైన డిస్కోజెనిక్‌లో బ్యాక్ పెయిన్ (Discogenic Low Back Pain) చికిత్సలో స్టెమ్ సెల్స్ ఉపశమనాన్ని ఇస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. సిస్టమాటిక్ రివ్యూలు (Systematic Reviews), దశ II క్లినికల్ ట్రయల్స్‌లో, స్టెమ్ సెల్ ఇంజెక్షన్ల తర్వాత రోగులలో నొప్పి, రోజువారీ కార్యకలాపాలలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. మెసెన్కైమల్ ప్రికర్సర్ సెల్స్ (MPCs) వంటి కణాలను నేరుగా వెన్నెముక డిస్క్‌లలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా డిస్క్ క్షీణతను మెరుగుపరచవచ్చని పరిశోధకులు అంటున్నారు. అయినప్పటికీ.. నిపుణులు ఈ చికిత్సను శాస్త్రీయ ఆధారాల మార్గదర్శకత్వంలో మాత్రమే ఎంచుకోవాలని, నిబంధనలు లేని క్లినిక్‌లు, నిరూపితం కాని చికిత్సల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చక్కెర ఎక్కువ తినేస్తున్నారా..? అయితే పిల్లలు పుట్టడమే కష్టమంటున్న నిపుణులు!!
Follow Us