AP: ఆంధ్రాలో ఉగాది నుంచి ఫ్రీ బస్సు!
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
తన ట్రెజరీ డిపార్ట్మెంట్ మీద చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్క్ స్టేషన్లలో కీలక పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. డిసెంబర్ ప్రారంభంలో ఈ సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను నిన్న పొడిగించింది.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అందరి కంటే రిచ్ అని చెబుతున్నారు. కళ్ళు చెదిరే ఆస్తులతో దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో.. చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ చెబుతోంది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది.
స్కాట్ లాండ్లో రీసెంట్గా కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్ధిని సాండ్రా సాజు శవమై కనిపించింది. ఎడిన్ బర్గ్ సిటీలోని ఆల్మండ్ నదిలో ఆమె మృత దేహం కనిపించిందని పోలీసులు చెప్పారు.
దక్షిణ కొరియా జెజు విమాన ప్రమాదంలో ఫ్లైట్లో ఉన్న ఇద్దరు తప్ప అందరూ చనిపోయారు. వీరిలో ఒకరు మహిళ కాగా మరొకరు పురుషడు లీ. ఇప్పుడు ఇతనికి రెండు రోజుల తరవాత మాట్లాడగలుగుతున్నారు. అసలేం జరిగింది, నేనెక్కడున్నాను అంటూ డాక్టర్లను ప్రశ్నలు అడుగుతున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన పీఎస్ఎల్వీ సీ–60 ప్రయోగం విజయవంతం అయింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో సక్సెస్ఫుల్గా ప్రవేశించాయి.
న్యూ ఇయర్ సదర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజలుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు.