దేశంలో సంపన్న ముఖ్యమంత్రి ఆంధ్రా సీఎం చంద్రబాబు అయితే పూర్ ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఏడీఆర్ విడుదల చేసిన సంపన్న ముఖ్యమంత్రుల జాబితా ప్రకారం చంద్రబాబు 931 కోట్ల ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. ఏపీ సీఎం కు 10 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. దేశంలో తక్కువ ఆస్తి రూ.15 లక్షలతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున ఉన్నారు. ఎన్నికల్లో నేతలు సమర్పించిన అఫిడవిట్‌లు, ఇతర లెక్కల ప్రకారం ఏడీఆర్ ఈ జాబితాను విడుదల చేసింది. ఇక సీఎం బాబు ఎన్నికల్లో సమర్పించిన అఫిడవి ప్రకారం ఆయన పేరిట 36 కోట్ల ఆసతులున్నాయి. కానీ ఆయన భార్య భువనేశ్వరి పేరిట మాత్రం ఏకంగా 895 కోట్ రూపాయల ఆస్తి ఉంది. ఇవి రెండూ..అఫిడవిట్‌లో ప్రస్తావించిన ఆస్తుల్లో హెరిటేజ్ ఫుడ్స్‌లో ఉన్న షేర్లనూ కలిపితే ఆయన ఆస్తి టోటల్‌గా 931 కోట్లు ఉన్నాయని తేలింది.
చంద్రబాబు తరవాత అరుణాచల్ సీఎం 332 కోట్లతో పేమా ఖండూ రెండో స్థానంలో, 51.93 కోట్ల ఆస్తితో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్తులు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయి. దీంతో ఆయన ఏడవ స్థానంలో ఉన్నారు. ఈయనకు రూ. కోటి అప్పు ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్ రూ.1.18 కోట్లతో, జమ్మూ–కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షలతో...రూ.15 లక్షల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున నిలిచారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అన్నీ కలిపి ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.52.59 కోట్లుగా ఉంది.
ముఖ్యమంత్రుల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉంది.
క్రిమినల్ కేసులు, చదువుకున్నవారు..
ఇక దేశవ్యాప్తంగా అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాను కూడా విడుదల చేశారు. ఇందులో అత్యధిక కేసులు ఉన్న సీఎంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదటిస్థానంలో ఉన్నారు. రేవంత్ పై ఏగగా 89కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈయన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉన్నారు. ఈయనపై 47కేసులున్నాయి. మూడో స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు 19కేసులతో ఉన్నారు. మరోవైపు 31 మంది ముఖ్యమంత్రులలో 9 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇందులో ఇద్దరు డాక్టరేట్ పొందారు. మొత్తం 31 మంది సీఎంలలో కేవలం ఇద్దరే మహిళా సీఎంలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ అతిశి ఉన్నారు.