పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె మరణించగా...శ్రీతేజ్ కిమ్స్ ఆసపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దొని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అతను డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని...బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే మొత్తం కేసు తారు మారు అవుతుందని...అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది... అంతకు ముందు అల్లు అర్జున్ పీఎస్‌లో కూడా సహకరించలేదని...అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే ఇదే పరిస్థితి మళ్ళీ ఎదురౌతుందని..కేసుకు అస్సలు సహకరించే అవకాశం ఉందడదని పోలీసులు వాదిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువలనే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు కోరారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం మళ్ళీ విషమించింది. అతనిని డాక్టర్లు మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టారు. ఒకవేళ బాబుకు ఏదైనా అయితే అల్లు అర్జున్‌ను మళ్ళీరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. Also Read: USA: అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ దాడి