Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు. 

author-image
By Manogna alamuru
New Update
Tollywood

balakrishna, mega heros

2024లో బిగ్ స్క్రీన్ మీద కనిపించని స్టార్స్ చాలామందే ఉన్నారు. కారణాలు ఏవైనా ఈ ఏడాదిలో ఒక్క సినిమాని కూడా ఆడియన్స్ కు అందించలేకపోయారు. ఆ హీరోలెవరో ఒకసారి చూద్దాం. 

మెగాస్టార్ చిరంజీవి..

202ఓ రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు 2024లో మారం ఒక్క సినిమా కూడా చేయలేదు.  గతేడాది వచ్చిన వాల్తేరు వీరయ్య' హిట్టయినా, 'భోళా శంకర్' డిజాస్టర్ గా మారడంతో కాస్త స్పీడ్ తగ్గించారు. ఈఏడాది అంతా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర ప్రాజెక్టు మీదనే వర్క్ చేశారు. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేశారు. 

బాలకృష్ణ...

ఈ ఏడాది అంతా నటసింహం బాలకృష్ణ కూడా ఏ సినిమా చేయలేదు. 2023లో 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరిలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ ఈ  ఇయర్ మాత్రం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, చంద్రబాబు అరెస్ట్ అవడం లాంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్న 'డాకు మహారాజ్' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ 2: తాండవం' చిత్రాన్ని ప్రారంభించారు. ఇవి కూడా ఈ ఏడాది దసరా టైమ్‌లో రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. 

వెంకటేష్..

2024లో వెంకటేష్ ఒక్కటే సినిమా చేశారు. పెద్ద హీరోలు గత కొన్నేళ్ళుగా ఏడాది ఒక్క సినిమానే చేస్తున్నారు. అయితే 2024లో వెంకటేష్ నటించిన సైంధవ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇది డిజాస్టర్‌‌గా నిలిచింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తో జనవరిలో వస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌కు ఇప్పటివరకు సూపర్ హిలే పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా వెంకటేష్ కు శుభారంభాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు.  

రామ్ చరణ్...

ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. దాదాపు రెండున్నరేళ్ళు అవుతోంది. లాస్ట్ ఇయర్ మాత్రం సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన హిందీ మూవీలో తళుక్కున మెరిశాడు. ఈ ఏడాది మొత్తం 'గేమ్ చేంజర్' షూటింగ్ లోనే గడిపేశారు. ఇప్పుడు సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌‌ తో వస్తున్నారు. దీంతో ఆయన మళ్ళీ హిట్ కొడతారని చెబుతున్నారు. దీంతో పాటూ ఇటీవలే బుచ్చిబాబు సినిమాని కూడా చెర్రీ సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇది కూడా ఈ ఏడాది రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

 నాగచైతన్య...

గతేడాది కస్టడీ సినిమాతో ఫ్లాప్ అందుకున్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తరువాత ఇంకే సినిమా చేయలేదు కానీ అప్పటి నుంచి తండేల్ మూవీతో మారం బిజీగా ఉన్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సర్వైవల్ లవ్ యాక్షన్ డ్రామా వచ్చే వాలెంటైన్స్ డే వీక్ లో ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఈ మధ్యనే కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ 'NC 24' మూవీని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 

అఖిల్, సాయి ధర్మ్ తేజ్..

అక్కినేని మరో వారసుడు అఖిల్ కూడా బిగ్ స్క్రీన్ మీదకు వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. 'ఏజెంట్' డిజాస్టర్ గా మారడంతో అయ్యగారు తన తరువాతి సినిమాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. పాపం అఖిల్‌కు ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. ఇప్పుడు తాజాగా మురళీ కిశోర్ అబ్బూరుతో 'Akhil 6' సినిమా కమిట్ అయ్యారు. ఇదైనా అతనికి లక్ తీసుకొస్తుందేమో చూడాలి. 

లాస్ట్ ఇయర్ 'విరూపాక్ష', 'బ్రో' సినిమాతో హిట్‌లు ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కు ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదు. ప్రస్తుతం అతన 'SDT 18' మూవీలో నటిస్తున్నారు. ఇక తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా గతేడాది 'ఆదికేశవ' సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటి వరకూ  కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.

ఇక వీరందరితో పాటూ అడవి శేష్, నవీన్ పోలిశెట్టి, మంచు బ్రదర్స్, నిఖిల్ లాంటి వారు కూడా 2024లో ఒక్క సినిమా చేయలేదు. 

Also Read: Cricket: డ్రా మిస్ చేశారు..సీరీస్ ఆధిక్యంలో ఆస్ట్రేలియా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు