USA: అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ దాడి

తన ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ మీద చైనా సైబర్ దాడులకు పాల్పడిందని అమెరికా ఆరోపిస్తోంది. వర్క్ స్టేషన్లలో కీలక పత్రాలను దొంగలించేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది. డిసెంబర్‌ ప్రారంభంలో ఈ సైబర్‌ దాడి జరిగినట్లు చెప్పింది.  

author-image
By Manogna alamuru
New Update
 Treasury

US Treasury

 

చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆరోపణలతో వెల్లువెత్తింది. తమ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై బీజింగ్ సైబర్ దాడులకు పాల్పడిందని..వర్క్ స్టేషన్‌లో కీలక పత్రాలను దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని చెప్పింది. కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. డిసెంబర్‌‌లో ఈ సైబర్ దాడి జరిగిందని..థర్డ్‌ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ బియాండ్‌ ట్రస్ట్‌ నెట్‌వర్క్‌ లోపాలను వాడుకొని హ్యాకర్లు వర్క్‌స్టేషన్లు, కీలకపత్రాలను యాక్సెస చేయానికి ప్రయత్నించిందని వాషింగ్టన్ ఆరోపిస్తోంది.  ఈ విషయంలో అప్రమత్తమైన బియాండ్ ట్రస్ట్ తమ దృషటికి తీసుకువచ్చిందని ట్రెజరీ విభాగం అధికారి చెబుతున్నారు. వెంటనే తాము దీన్ని సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు. 

ఖండించిన చైనా..

అయితే దీనిపై అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. అలాగే చైనా రాయబార కార్యాలయం దీనిని తీవ్రంగా ఖండించింది. తమపై అమెరికా అనవసరమైన ఆరోపణలు చేసిందని...వీటిని వ్యతిరేకిస్తున్నామని అంది. మరోవైపు జార్జియాలోని బియాండ్‌ ట్రస్ట్‌ సైతం ఈ సైబర్‌ దాడిపై రియాక్ట్ కాలేదు.  అయితే, వారి వెబ్‌సైట్‌లో..రీసెంట్ గా తమ కస్టమర్ల భద్రత ముప్పునకు సంబంధించిన ఘటనలు గుర్తించినట్లు మాత్రం ఒప్పుకుంది. 

ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాల ఆధారంగా... చైనాకు చెందిన అడ్వాన్స్‌డ్ పెర్సిస్టెంట్ థ్రెట్ ఈ హ్యాక్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. యూఎస్ ఏజెన్సీలు ఇదొక పెద్ద సంఘటనగా అభివర్ణించాయి. మొదట ఈ హ్యాక్ జరిగినట్టు డిసెంబర్ 2న గుర్తించారు. దానిని నిర్ధారణ చేసుకోవడానికి మరో మూడు రోజులు ఆగాల్సి వచ్చిందని ట్రెజరీ ప్రతినిధి ఒకరు చెప్పారు. హ్యాకర్ అనేక ట్రెజరీ వినియోగదారు వర్క్‌స్టేషన్‌లను, ఆ వినియోగదారులు ఉంచిన కొన్ని వర్గీకరించని పత్రాలను రిమోట్‌గా యాక్సెస్ చేయగలిగారని చెప్పారు. అయితే ఈ ఫైళ్ళు ఎలాంటివి, ఎప్పుడు, ఎంతకాలం హ్యాక్ చేశారన్న విషయాలను మాత్రం ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చెప్పలేదు. హ్యాకర్లు బియాండ్‌ట్రస్ట్ ద్వారా మూడు రోజుల్లో ఖాతాలను సృష్టించవచ్చు లేదా పాస్‌వర్డ్‌లను మార్చవచ్చని తెలిపారు. దీనిపై అనుబంధ నివేదికను 30రోజుల్లో అధికారులకు అందజేస్తామని చెప్పారు. 

Also Read: ADR Report: రిచ్ చంద్రబాబు..పూర్ మమత..ఏడీఆర్ నివేదిక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు