న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో మైదరాబాద్‌లో మందుతో పాటూ డ్రగ్‌ను కూడా విచ్చలవిడిగా సరఫరా చేస్తారు అయితే ఈసారి డ్రగ్స్ వాడకం మీద స్ట్రిక్ట్ ఆర్డర్లను పెట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటే ముందే వీటికి సబంధించి తనిఖీలు చేపట్టారు. టీఎస్ నాబ్ పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారం తో గత రెండు మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని సమాచారం అందుకున్న టీఎస్ నాబ్ పోలీసులు.. ఈవెంట్ కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్ టెస్ట్ లు నిర్వహించారు. పోలీసులు తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పబ్ కు వచ్చిన వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీనికి సంబంధించి ఏడుగురిని నాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఈవెంట్ లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకుని ఈవెంట్ కు వచ్చారా అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కోసమని తరలిస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి చెక్ పోస్ట్ వద్ద రూ.1.60 లక్షల విలువైన 64మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఆబ్కారి శాఖ అధికారులు. నలుగురిని అరెస్ట్ కూడా చేశారు. Also Read: South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్