కేరళ ఎర్నాకులంలోని పెరుంబవూరుకు చెందిన 22ఏళ్ళకు చెందిన సాండ్రా సాజు ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లింది. ఎడిన్ బర్గ్ లో హెరియట్ వాట్ యూనివర్సిటీలో ఆమె ఎంఎస్ చదువుతోంది. అయితే డిసెంబర్ 6న గైల్ ప్రాంతంలో సాండ్రా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కోసం పోలీసులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు ఆల్మండ్ నదిలో సాండ్రా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
ఆత్మహత్యగా అనుమానం..
సాండ్రా చివరి సారిగా కనిపించిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు బయటపెట్టారు. అందులో ఆమె ముఖానికి నల్లని మాస్క్ వేసుకుని కనిపించింది. డిసెంబరు 6న రాత్రి 9:10 నుండి 9:45 గంటల సమయంలో ఎడిన్‌బర్గ్‌లోని గైల్ ప్రాంతంలో సాండ్రా కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఆమె శవమై కనిపించడంతో...ఆత్మహత్య చేసుకుంని పోలీసులు భావిస్తున్నారు. సాండ్రా మరణవార్తలను ఆమె తల్లిదండ్రులకు అందించారు. సాండ్రామృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
One week on from our initial appeal, officers in are continuing their enquiries to trace Santra Saju, 22, who is missing from the South Gyle area of Edinburgh.https://t.co/dFVyNKsiC0 pic.twitter.com/hWTYo5b7e6
— Police Scotland West Lothian (@PSOSWestLothian) December 23, 2024
Also Read: అసలేం జరిగిందీ..నేనెక్కడున్నాను...జెజు ఫ్లైట్ మృత్యుంజయుడు