భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ60 విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహకనౌక.. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్పేస్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర శాటిలైట్లు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం జరిగింది. సోమవారం రాత్రి 9.58 PM గంటలకు బదులుగా 10 గంటల 15 సెకండ్లకు రీషెడ్యూల్ చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. దీని ప్రకారం సరిగ్గా 10 గంటల 15 సెకెన్లకు నిప్పులు చిమ్ముతూ పీస్ఎల్వీ సీ–60 శ్రీహరికోటలోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళింది. స్పేడెక్స్ ప్రయోగం ద్వారా ఛేజర్, టార్గెట్ శాటిలైట్లను కక్ష్యలో పీఎస్‌ఎల్సీవీసీ-60 ప్రవేశపెట్టనుంది. ఈ రెండు ఉపగ్రహాల బరువు మొత్తం 440 కిలోలు. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.
#WATCH आंध्र प्रदेश: भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO) ने श्रीहरिकोटा से SpaDeX और इनोवेटिव पेलोड के साथ PSLV-C60 का प्रक्षेपण किया। पहले चरण का प्रदर्शन सामान्य रहा।
— ANI_HindiNews (@AHindinews) December 30, 2024
(सोर्स: ISRO/ANI) pic.twitter.com/qNQjF0Ya8x
నాల్గవ దేశంగా భారత్..
భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమ నౌకలు వ్యోమనౌకలు రెండూ డాకింగ్ చేసుకుంటాయి. భవిష్యత్తులో చంద్రుని మీద చేసే ప్రయోగాలకు ఈ డాకింగ్ ఉపయోగపడుతుందని ఇస్రో చెబుతోంది. ఇలాంటి ప్రయోగం చేసిన దేశాలలో భారత్ నాల్గవ స్థానంలో నిలవనుంది. ఇప్పటికే రష్యా, అమెరికా, చైనా దేశాలు ఈ సాంకేతికతను కలిగి ఉన్నాయి.
Also Read: HYD: న్యూఇయర్ కు ముందే పెద్ద పబ్‌లో డ్రగ్స్ పట్టివేత