జెజు ఎయిర్ విమానం థాయ్‌లాండ్ నుంచి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియా లోని ముయాన్‌కు బయలుదేరింది. ప్రయాణం మొత్తం అయిపోయింది...ఇక అయిదు నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అనుకున్న సమయానికి విమానం రన్‌వేపై జారుతూ.. నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్ళి.. గోడను ఢీకొట్టి, పేలిపోయింది. అయితే ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దానివలనే ఫ్లైట్ ప్రమాదానికి గురి అయింది.
మృత్యుంజయులు..
ఇందులో ప్రయాణికులు 175 మంది చనిపోయారు. ఫ్లైట్ సిబ్బంది ఆరుగురిలో ఇద్దరు తప్ప మిగతా అందరూ చనిపోయారు. అందులో ఒకరు మహిళ, మరొకరు పురుషుడు కాగా.. వారిద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఓ ఫ్లైట్ అటెండెంట్‌ను లీగా (33) గుర్తించారు. తాజాగా అతను స్పృహలోకి వచ్చాడు. అసలేం జరిగింది, తానెక్కడున్నాను లాంటి ప్రశ్నలను డాక్టర్లను అడుగుతున్నాడని తెలుస్తోంది. ల్యాండింగ్ టైమ్‌లో సీటు బెల్టు పెట్టుకోవడమే తనకు గుర్తుందని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తులేదని లీ చెప్పాడని డాక్టర్లు చెబుతున్నారు. అతడు షాక్‌కు గురయ్యాడని.. ఫ్లైట్ ఇంఛార్జ్‌గా ఉన్న అతను విమానం తోక భాగంలో కూర్చున్నాడని చెప్పారు. అతడి భుజానికి, తలకు గాయాలైనట్లు తెలిపారు.
ప్రమాదంలో బతికిన మరో మహిళా అటెండెంట్ క్వాన్ గా గుర్తించారు. ఈమెకు తల, పొత్తి కడుపుతో పాటూ కాళ్ళకు గాయాలయ్యాయి. ఈమెకు కూడా స్పృహ వచ్చినా ఇంకా మాట్లాడే పొజిషన్లోకి మాత్ర రాలేదని వైద్యులు చెబుతున్నారు.