Dhanush Son: ఫస్ట్ టైమ్.. కొడుకుతో కలిసి దుమ్మురేపిన ధనుష్.. డాన్స్ వీడియో వైరల్!

 'ఇడ్లీ కడై' ఆడియో లాంచ్ వేడుకలో ధనుష్ కొడుకు లింగా స్టేజ్ పై తండ్రి ధనుష్ తో కలిసి స్టెప్పులేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కొడుకు డాన్స్ చేయడం చూసి ధనుష్ మురిసిపోయారు.

New Update
DHANUSH DANCE WITH SON

DHANUSH DANCE WITH SON

Dhanush Son:  తమిళ  స్టార్ హీరో ధనుష్ అటు తమిళ్, ఇటు తెలుగులో వరుస విజయాలతో ఊపు మీదునున్నారు. ప్రస్తుతం తన తదుపరి సినిమా  'ఇడ్లీ కడై' విడుదలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తవగా.. మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు టీమ్. ఇందులో భాగంగా తాజాగా  'ఇడ్లీ కడై' ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. చెన్నై వేదికగా జరిగిన ఈ వేడుకలో ధనుష్ కొడుకు లింగా స్టేజ్ పై స్టెప్పులేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. 'ఇడ్లీ కడై' సినిమాలోని  పాటను ప్లే చేయగానే లింగ స్టేజ్ పైకి వచ్చి తండ్రితో కలిసి డాన్స్ వేశాడు. కొడుకు డాన్స్ చేయడం చూసి ధనుష్ మురిసిపోయారు. డాన్స్ తర్వాత లింగాను హగ్ చేసుకొని నుదుటిపై ముద్దుపెట్టారు. ఈ దృశ్యం ఆడియో లాంచ్ ఈవెంట్ లో స్పెషల్ హైలైట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు  ''జూనియర్ ధనుష్'' అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

అక్టోబర్ 1న విడుదల 

రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్- నిత్యామీనన్ జంటగా నటించారు. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్ కిరణ్, పార్తీబన్, సముద్రఖని తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. 'తిరుచిత్రంబళం' బ్లాక్ బస్టర్ తర్వాత ధనుష్- నిత్యామీనన్ కలిసి నటిస్తున్న రెండవ చిత్రమిది. దీంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి  ధనుష్ హీరో మాత్రమే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యహహరించారు. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న నాల్గవ సినిమా ఇది. గతంలో ధనుష్ నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం, రాయన్, నాన్ రుద్రన్ సినిమాలు డైరెక్ట్ చేశారు. ధనుష్ వండర్ బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్‌, ధనుష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. వచ్చే నెల 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. తెలుగులో శ్రీవేదాక్షర మూవీస్ బ్యానర్ పై చింతలపల్లి రామారావు దీనిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులు రూ.3.75 కోట్ల నుంచి రూ.6 కోట్ల మధ్య అమ్ముడుపోయినట్లు సమాచారం.ఇదిలా ఉంటే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ధనుష్ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇటీవలే  తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన  'కుబేర' సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. 

Also Read: Teja Sajja: అయ్యయో.. అందరి ముందు తేజ బుగ్గలు గిల్లిన స్టార్ డైరెక్టర్ 😍! ప్రోమో అదిరింది

Advertisment
తాజా కథనాలు