Kubera: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన నాగార్జున ఫస్ట్ లుక్ వీడియో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ‘హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ కింగ్’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నాగార్జున ఫస్ట్ లుక్ వీడియోలో డబ్బు కట్టలతో ఉన్న లారీ విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. అంతే కాదు రష్మిక, ధనుష్ గ్లిమ్ప్స్ వీడియోలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.
పూర్తిగా చదవండి..Kubera: కింగ్ బర్త్ డే స్పెషల్.. ‘కుబేర’ నుంచి కొత్త పోస్టర్..!
తమిళ్ స్టార్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఇందులో అక్కినేని నాగార్జున మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ద్వారా 'హ్యాపీ బర్త్ డే కింగ్' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Translate this News: