Kuberaa Twitter Review: ‘కుబేర’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్- నాగార్జున హిట్టు కొట్టారా? ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ‘కుబేర’ మూవీ ఇవాళ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రీమియర్ షోలు వేశారు. దీంతో ఈ మూవీ రివ్యూలను సినీ ప్రియులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ సినిమా ఎలా ఉంది?.. టాక్ ఏంటి? అనేది తెలుసుకుందాం. 

New Update
Kuberaa Telugu Twitter Review

Kuberaa Telugu Twitter Review

ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఇవాళ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రీమియర్ షోలు వేశారు. దీంతో ఈ మూవీ రివ్యూలను సినీ ప్రియులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?.. నెటిజన్లకు నచ్చిందా? లేదా?.. సినిమా టాక్ ఏంటి? అనేది తెలుసుకుందాం. 

Kuberaa Twitter Review

ఓ నెటిజన్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తన రివ్యూను పంచుకున్నారు. మీసం తిప్పుదాం ఇంక అంటూ రాసుకొచ్చారు. ది కింగ్ ఈజ్ బ్యాక్.. కింగ్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ మూవీ పడింది అంటూ అందులో రాసుకొచ్చారు. 

ఇంకొకరు.. కుబేర మూవీలో సెకండ్ హాఫ్ అదిరిపోయిందన్నారు. కనీసం 4-5 ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని.. అవి టికెట్ ధరకు వర్త్ అనిపించాయని.. మిగతావన్నీ బోనస్‌గా చెప్పుకొచ్చారు. ధనుష్‌కి చాలా అవార్డులు వస్తాయని.. ఈ సినిమాలో తన పాత్ర చేయడానికి అంగీకరించినందుకు నాగార్జునకు ఎంతో గౌరవం లభిస్తుందన్నారు. రష్మిక తన కెరీర్‌లో మరో చిరస్మరణీయ పాత్ర చేసిందన్నారు. అలాగే దేశీ శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని తెలిపారు. 

మరొకరు.. ‘‘కుబేర మూవీ చూడదగ్గ క్రైమ్ డ్రామా. ఇందులో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో మంచి సన్నివేశాలు ఉంటాయి. అయితే ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌ చాలా పొడవుగా ఉంటుంది. ధనుష్ తన కెరీర్‌లో అత్యుత్తమ నటనను కనబరిచాడు. ఈ చిత్రంలో ఆసక్తికరమైన కథాంశం, అక్కడక్కడ మంచి సన్నివేశాలు ఉన్నాయి.’’ అని రాసుకొచ్చాడు.

Advertisment
తాజా కథనాలు