Khammam : ఇదేందయ్య ఇది.. బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే.. డెత్ సర్టిఫికెట్
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ఎమ్మార్వో కార్యాలయంలో చోటు చేసుకుంది. గట్టుసింగారం గ్రామానికి చెందిన బాలిక పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రానికి బదులు మరణ పత్రం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది.
TG Crime : మైనర్ బాలిక పై అత్యాచార యత్నం.. దేహశుద్ధి చేసి
ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు.
ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ!
ఖమ్మం యువకుడికి మ్యాట్రిమోనిలో ఓ యువతి పరిచయమయ్యింది. ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని యువకుడిని ఆశ చూపించింది. యువతిని నమ్మిన యువకుడు రూ.40 లక్షలు అందులో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Minister Ponguleti : మంత్రి పొంగులేటికి గాయం!
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.ఈ క్రమంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గాయపడ్డారు.వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన బయల్దేరగా.... మంత్రి ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కింద పడ్డారు.
Telangana Election: ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నాం..తుమ్మల సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు స్వార్థపరులు దోచుకుంటుంటే చూస్తూ ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించారు.
వారంలో పెళ్లి..అంతలోనే మృత్యువు ఒడిలోకి..!!
వారంలో పెళ్లి.. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరింది భార్గవి అనే యువతి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో చోటుచేసుకుంది. అపెండిక్స్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెళ్లి కూతురు దురిశెట్టి భార్గవి మృతి చెందింది. భార్గవి పెళ్లి ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులు.. కూతురి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.
Khammam Girls Hostel News: బాలికల వసతి గృహంలో ఆగంతకుల కలకలం.. అందుకే వచ్చారా..?
ఖమ్మం జిల్లాలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు ఆగంతకులు హాస్టల్లోకి దూరి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ ఘటనతో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో ఉద్రిత్తగా మారింది.
Khammam: 7 నెలల గర్భవతి సూసైడ్..భర్త ఆత్మహత్యాయత్నం..అసలు ఏం జరిగిందంటే..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప్పాకలో ప్రేమపెళ్లి విషాదంగా ముగిసింది. 7 నెలల గర్భవతి స్వప్న ఉరేసుకుంది. భార్య మరణం తెలుసుకున్న భర్త సాయికుమార్ సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. నా చావుకి కారణం డాక్టర్ మౌనిక అని తన ఎడమచేతిపై సాయికుమార్ రాసుకోవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది.