/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t122906012-2025-11-03-12-29-52.jpg)
Son addicted to alcohol..father who mixed insecticide
Khammam News: మద్యానికి బానిసైన కొడుకును వదిలించుకోవడానికి ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కొడుకుకు మద్యంలో పురుగుల మందు కలిపి తాగించాడు.ఈ అమానుష ఘటన ఖమ్మం జల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో చోటు చేసుకుంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొడుకు మద్యానికి బానిస అయ్యాడని బ్రాందీలో పురుగుల మందు కలిపి తాగించాడు ఓ తండ్రి. వివరాళ్లోకి వెళ్తే.. ఆదూరి రాజేష్ కుమారుడు ఆదూరి నాగరాజు(18) మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పిన వినకపోవడంతో.. విసుగు చెందిన రాజేష్ తన కుమారుడు నాగరాజుకు బ్రాందీలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు.
వివరాల ప్రకారం ఆదూరి రాజేష్ ఆదూరి నాగరాజు ఇద్దరు తండ్రి కొడుకులు. నాగరాజుకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. అప్పటి నుండి తండ్రి కొడుకులు ఇద్దరు మందుకు బానిసయ్యారు. గత కొంతకాలంగా తండ్రి కొడుకులు మద్యం సేవిస్తూ ఇద్దరూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో నాగరాజు తండ్రిని కొడుతుండేవాడు. దీంతో విసుగు చెందిన రాజేష్ ఎలాగైనా తన కొడుకును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
గత నెల 20వ తేదీ దీపావళి రోజున బ్రాందీ తీసుకొచ్చి దాంట్లో పురుగులమందు కలిపి కొడుకును తాగమని చెప్పాడు. నాగరాజుకు విషయం తెలియక బ్రాందీ అనుకుని తాగాడు. దీంతో అస్వస్థకు గురైన అతన్ని ఖమ్మం హాస్పిటల్‌కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. అయితే నాగరాజు చికిత్స పొందుతూ అక్టోబర్ 31న సాయంత్రం మృతి చెందాడు. నాగరాజును తండ్రి రాజేష్ చంపాడని మృతుడు పెద్దమ్మ తల్లాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తల్లాడ రెండవ ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : శామ్‌సంగ్ సంచలనం.. స్మార్ట్ టీవీ కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి AI యాప్ లాంచ్
Follow Us