ఖమ్మం జిల్లాలో నయా సైబర్ క్రైం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడు వధువు కోసం మ్యాట్రిమొనీలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఓ యువతితో పరస్పరం అభిరుచులు కలవడంతో క్లోజ్ అయ్యాడు. అయితే తన పేరు స్మిథి అని యూకేలో ఉంటున్నానని ఆ యువకుడికి తెలిపింది. కేవలం వాట్సాప్ ద్వారా ఇద్దరు మాట్లాడుకునేవారు. అలా ఇద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరగసాగింది. ఈ క్రమంలో ఓ రోజు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌పై యువకుడి అభిప్రాయం ఏంటో ఆ యువతి అడిగి తెలుసుకుంది. ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే! లాభాలు ఆశచూపి.. అలా బైగెట్ కాయిన్ ట్రేడింగ్ అప్లికేషన్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని యువకుడికి ఆశచూపింది. ఆమె మాటలు నమ్మి లక్ష రూపాయలు చెల్లించి బైగెట్ కాయిన్ అప్లికేషన్‌లో రిజిస్టర్ అయ్యాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజుల్లోనే తన అప్లికేషన్ వ్యాలెట్‌లో మూడు లక్షలకు అమౌంట్ పెరిగింది. దీంతో ఆ యువతి మాటలు నమ్మి.. నాలుగు నెలల సమయంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. విడతల వారీగా మొత్తం 40,74,400 రూపాయలు బైగెట్ కాయిన్ ట్రేడింగ్ అప్లికేషన్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఈ మొత్తానికి 1,50,00,000 రిటర్న్స్ వచ్చినట్లు బైగెట్ కాయిన్ అప్లికేషన్‌లో చూపించారు. అయితే ఈ ట్రేడింగ్‌లో వచ్చిన అమౌంట్ అంతా విత్ డ్రా చేయడానికి బైగెట్ కాయిన్ అప్లికేషన్ కస్టమర్ కేర్‌ను యువకుడు సంప్రదించాడు. మనీ విత్ డ్రా చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫీజు, డిపాజిట్ ఫీజ్ ఇంకా కొంత చెల్లించాలని కస్ట్‌మర్ కేర్ వారు తెలిపారు. డౌట్ వచ్చి మళ్లీ యువతిని సంప్రదించాడు. ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు ఆమె అడిగినంత ఫీజు చెల్లిస్తేనే డబ్బు తిరిగి వస్తుందని నమ్మించింది. ఆ యువతిని నమ్మి ఫీజు పే చేసిన తర్వాత యువతితో పాటు కస్టమర్ కేర్ వాళ్లు కూడా స్పందించలేదు. చివరకు మోసం పోయానని తెలుసుకుని ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాధు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు