Crime: మీ తమ్ముడు పడిపోయాడని చెప్పి తీసుకెళ్లి..బాలికపై అత్యాచారం

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక (13)పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.

New Update
gang rape in Bengaluru

Girl gang-raped by three

Crime: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక (13)పై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు మైనర్లు (16 సంవత్సరాలు), మైనర్లిద్దరూ ఇంటర్‌ చదువుతున్నారు. మరొకరు మేజర్‌ (18 ఏండ్లు) అయిన అరవింద్‌ డిగ్రీ చదువుతున్నాడు.

రాత్రి శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో బాలిక చర్చి నుంచి ఇంటికి వెళుతుండగా కాలనీకి చెందిన ఈ ముగ్గురు బాలికకు మీ తమ్ముడు కళ్ళు తిరిగి కింద పడ్డాడని మాయమాటలు చెప్పి ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇద్దరు బాలురతో కలిసి ఆ యువకుడు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుంది. బాలిక తల్లిదండ్రులు పని మీద హైదరాబాద్‌ వెళ్లగా, ఇంట్లో ఉన్న నానమ్మ, తాతయ్య  కూడా ప్రార్థన మందిరానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇంట్లో ఎవరూ లేరని గమనించిన నిందితులు మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో బాలిక ఇంటి వద్దకు వెళ్లి గేటు తీసి ఇంటిలోకి ప్రవేశించి బాలికను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి బలత్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో పారిపోయారు. 

శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరునాడు బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది.బాలిక తల్లి.. ఈ మేరకు  బాలిక తల్లి ఫిర్యాదుతో ఎస్సై సూరజ్‌ నిందితులపై పోక్సో, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. అరవింద్‌ను అదుపులోకి తీసుకోగా బాలురు పరారీలో ఉన్నారు.

Also Read: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. సర్వేలో సంచలనం

Advertisment
తాజా కథనాలు