Khammam : ఇదేందయ్య ఇది.. బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే.. డెత్ సర్టిఫికెట్
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ఎమ్మార్వో కార్యాలయంలో చోటు చేసుకుంది. గట్టుసింగారం గ్రామానికి చెందిన బాలిక పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రానికి బదులు మరణ పత్రం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది.