Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు
శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు.
ఓ పారిశుధ్య కార్మికులు రాసిన పుస్తకాన్ని కాలికట్ విశ్వవిద్యాలయం , కన్నూర్ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, బీఏ లో పాఠ్యాంశంగా చేర్చారు. తిరువనంతపురంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న ధనుజ సక్సెస్ స్టోరీ ఈ కథనంలో...
ప్రధాని మోదీ శనివారం కేరళలో పర్యటించారు. కొండచరియలు విరిగిన ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వయనాడ్ లో సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా..మరో 200 మంది కనిపించకుండా పోయారు.ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు.కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేస్తారని అధికారులు వివరించారు.
కేరళ వయనాడ్లో జరిగిన విధ్వంసంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. వారికి అండగా నిలిచేందుకు చీటింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ భారీ సాయం ప్రకటించాడు.తన విరాళంగా రూ. 15 కోట్లను అంగీకరించాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ కు సుకేశ్ లేఖ రాశాడు.
మెగాస్టార్ చిరంజీవి కేరళ బాధితులకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు తాజాగా కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ను కలిసి కోటి రూపాయల చెక్ ను అందజేశారు.