Walayar case: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!

కేరళ ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 2017లో జరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ నడుస్తుండగా తల్లి తన 13,9 ఏళ్ల కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి చేయించినట్లు తేలింది. ఆమె భర్త సహకారం కూడా ఉందని తెలుస్తుండగా నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 

New Update
Kakinada: మైనర్ బాలికపై దాడి... పోక్సో కేసు నమోదు..!

Kerala Walayar case

Walayar case: కేరళ ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 2017లో జరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ నడుస్తుండగా తల్లి తన కూతుళ్లపై లైంగిక దాడి చేయించినట్లు తేలింది. అయితే అత్యాచారం చేసిన వ్యక్తుల్లో ఒకరితో ఆమెకు అక్రమ సంబంధం ఉందని, ఆమె భర్త కూడా పిల్లలపై పలుసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు సీబీఐ ఆరోపించింది. భర్త, పిల్లల సమక్షంలోనే A1 నిందితుడు వాలియ మధుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. వారందరి వేధింపులను తట్టుకోలేక 9, 13, ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు సైసైడ్ చేసుకున్నట్లు వెల్లడించింది. 

కేసు కొట్టివేసిన కోర్టు..

ఈ ఘటన 2017లో జరగగా.. జనవరి 13న 13 ఏళ్ల బాలిక వలయార్‌లోని అట్టప్పలంలో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. 2 నెలల తర్వాత 2017 మార్చి 4న ఆమె 9ఏళ్ల చెల్లెలు ఉరేసుకుని మరణించింది. మొదట ఆత్మహత్యలుగా భావించగా పోస్టుమార్టం నివేదికల్లో లైంగిక దాడి జరిగిందని తేలడంతో స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు రేకెత్తాయి. అయితే ఆధారాలు లభించకపోవడంతో పాలక్కాడ్ పోక్సో కోర్టు కేసు కొట్టివేసింది. నిందితులు వాలియ మధు, ఎం మధు, శిబు, ప్రదీప్ కుమార్‌లపై సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. ఇది కేరళ వ్యాప్తంగా భారీ నిరసనలు కారణమవగా బాలికల పేరెంట్స్ లైంగిక నేరాలకు సంబంధించి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద విచారణ ఎదుర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!

2019లో సిట్ ఏర్పాటు..

అయితే ఈ కేసు 2019 జూన్ లో అనూహ్యంగా మలుపు తిరగడంతో సిట్ ఏర్పడింది. లైంగిక వేధింపుల వల్లే పిల్లలు చనిపోయారని పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు 2021లో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్, 2021లో పోలీసులు ఛార్జిషీట్ లలో తేడాలుండటంతో పోక్సో కోర్టు తిరస్కరించింది. దీంతో  2024 ఆగస్టులో కేరళ హైకోర్టు ఈ కేసును ఎర్నాకుళం సీబీఐ కోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ విచారణలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగినట్లు సీబీఐ తేల్చింది. అక్కను మొదట వేధించగా అది చూసిన చిన్న పాట తీవ్ర మనోవేధనకు గురైనట్లు సీబీఐ తెలిపింది. 

ఇది కూడా చదవండి: Trump: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన

నిందితులకు జీవిత ఖైదు..

ఇక ఈ కేసు తాజా సీబీఐ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. తల్లిదండ్రులే లైంగిక దాడికి అనుమతించారని, ఏళ్ల తరబడి వారి టార్చర్ ను పిల్లలు భరించారని చెప్పింది. తనతో లైంగిక సంబంధం పెట్టుకున్న వాడే పెద్ద అమ్మాయిని రేప్ చేశాడని తెలిసినా పెద్దగా పట్టించుకోని దుర్మార్గురాలు చిన్న కూతురిపై కూడా అత్యాచారం చేసేందుకు ప్రోత్సహించినట్లు వెల్లడైంది. అయితే సీబీఐపై తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తాము నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్ధమని వాదిస్తోంది. దీనిని కోర్టు నిర్ధారించాల్సి ఉండగా సీబీఐ ఆరోపణలు నిజమైతే నిందితులకు జీవిత ఖైదు తప్పదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు