Raging: మీరేం విద్యార్థులురా.. జూనియర్స్ మర్మాంగాలకు డంబెల్స్‌ కట్టి సీనియర్ల ర్యాగింగ్!

కేరళలోని నర్సింగ్ కాలేజీలో జూనియర్లపై సీనియర్లు దారుణమైన ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. 5గురు 3rd ఇయర్ విద్యార్థులు 1st ఇయర్ అబ్బాయిల మర్మాంగాలకు డంబెల్స్ కట్టి వేలాడదీశారు. గాయాలపై కెమికల్స్ పోశారు. ఏడుస్తుంటే నోట్లో స్ర్పే కొట్టారు. 

New Update
kerala

kerala Photograph: (kerala)

Raging: కేరళలోని నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొట్టాయం నర్సింగ్ కాలేజీలో తిరువనంతపురానికి చెందిన ఐదుగురు 3rd ఇయర్ సీనియర్లు ముగ్గురు 1st ఇయర్ స్టూడెంట్స్‌ను దారుణంగా ర్యాగింగ్ చేశారు. అబ్బాయిల బట్టలిప్పించి వారి మర్మాంగాలకు డంబెల్స్ కు కట్టి వేలాడదీశారు. అంతటితో ఆగకుండా గాయాలైన చోట కెమికల్స్ పోశారు. 

ఏడుస్తుంటే నోట్లో స్ప్రే కొట్టారు..

దీంతో మంట, నొప్పి భరించలేక బోరున విలపిస్తున్న పిల్లల నోట్లో స్ప్రే కొట్టారు. వారి దగ్గరున్న డబ్బులు బలవంతంగా గుంజుకున్నారు. ఇదంతా ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అయితే ఈ విషయాన్ని బాధితులంతా కలిసి పోలీసులకు చెప్పారు. వెంటనే యాక్షన్ మొదలుపెట్టిన పోలీసులు కాలేజీకి వెళ్లి పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Khammam Crime: ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. !

దీనిపై కాలేజీ యాజమాన్యం ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా జూనిర్స్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు కాలేజికి వెళ్లి టీచర్లతో వాగ్వాదానికి దిగారు. నిందుతులను కఠినంగా శిక్షించడంతోపాటు టీసీ ఇచ్చి కాలేజీనుంచి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

ఇది కూడా చదవండి: Trump Warning: హమాస్‌పై ట్రంప్ వార్ డిక్లైర్ .. 72 గంటల్లో యుద్ధం!

Advertisment
తాజా కథనాలు