BRK Bhavan: హై టెన్షన్: BRK భవన్ వద్ద భారీ బందోబస్తు
కేసీఆర్‌కు మద్దతుగా హైదరాబాద్‌లోని BRK భవన్‌కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. BRK భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Palla Rajeshwar Reddy: కేసీఆర్ ఫౌంహౌస్‌లో జారిపడ్డ MLA.. పల్లాకు తీవ్ర గాయాలు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయాలపాలైయ్యారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో బుధవారం ఆయన జారిపడ్డారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలింస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరుకానున్న సందర్భంగా ఆయన ఫాంహౌస్‌కు వెళ్లారు.
Kaleshwaram Commission: 18వ వ్యక్తిగా KCR.. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్
కాళేశ్వరం కమిషన్ మిచారణ చేపట్టనున్న జస్టిస్ ఘోష్ కమిటీ ముందుకు బుధవారం మాజీ సీఎం KCR హాజరుకానున్నారు. నేడు ఉదయం 11.30 నిమిషాలకు విచారణకు రానున్నారు. ఇప్పటి వరకు ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారణ చేయగా.. ప్రస్తుతం ఇన్ కెమెరా ముందు కేసీఆర్‌ను ప్రశ్నించనుంది.
Kaleshwaram Commission: 20 ప్రశ్నలు.. ఆధారాలతో సహా అన్నీ బయటపెట్టానన్న హరీశ్ రావు!
మాజీ మంత్రి హరీశ్ రావు సోమవారం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైయ్యారు. బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఆయన్ని 45 నిమిషాల పాటు ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నలన్నీటికీ ఆధారతోసహా సమాధానాలు చెప్పానని ఆయన మీడియాతో అన్నారు.
Eatala Rajendar : ముగిసిన ఈటల రాజేందర్ విచారణ... ఆయన ఏం చెప్పారంటే...
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. ఓపెన్ కోర్టులో ఈటలను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కేవలం 20 నిమిషాల్లోనే ఈ విచారణ ముగిసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థికమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
చావుల, పెళ్లిళ్ల దగ్గరే హరీశ్ రావుని కలిశాను : ఈటల రాజేందర్
తాను హరీశ్ రావుని కలిశాని వస్తున్న వార్తలను MP ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. BJPయే తెలంగాణకు దిక్సూచి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు.
Kaleshwaram Project: ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం.. అది ఎన్డీఏ నాటకం.. కేటీఆర్ సంచలన ట్వీట్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదంతా ఎన్డీఏ ఆడుతున్న నాటకమని ఆయన ఆరోపించారు.
Harish Rao-KCR Meeting: కేసీఆర్‌తో హరీశ్ రావు కీలక భేటీ.. ఆ అంశంపై చర్చ?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిశారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కమిషన్ నోటీసులు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.