B.R. Gavai : చీఫ్ జస్టిస్ గవాయ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు తీవ్ర ఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఆస్పత్రిలో చేరారు.