Waqf Board: వక్ఫ్ బిల్లుపై కేంద్రం సంచలన వ్యాఖ్యలు!  వక్ఫ్ ఇస్లామిక్ భావన అంటూనే ట్విస్ట్...

వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్‌ అనేది ఇస్లామిక్‌ భావనే కావచ్చు కానీ, అది ఇస్లాం మతంలో కీలక భాగం కాదని వ్యాఖ్యానించింది.

New Update
Waqf Bill

Waqf Bill

Waqf Board:  వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్‌ అనేది ఇస్లామిక్‌ భావనే కావచ్చు కానీ, అది ఇస్లాం మతంలో కీలక భాగం కాదని వ్యాఖ్యానించింది. కాగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ చట్టాన్ని సవరిస్తూ తీసుకున్న నిర్జయాన్ని సవాల్‌ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. నిన్నటి నుంచి వీటిపై విచారణ నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా పిటిషన్లపై కోర్టు విచారించింది.

ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

ప్రభుత్వం తరుపున విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే అంటూనే ట్విస్ట్‌ ఇచ్చారు. ఇది ఇస్లాంలో కీలక భాగం కాదని స్పష్టం చేశారు. ఇది ప్రాథమిక హక్కు కాదని తేల్చి చెప్పారు తుషార్ మెహతా. 

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు


 దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను, వాళ్ల ఆస్తుల్ని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్న తుషార్ మెహతా. ప్రజల ఆస్తులను పక్కదారి పట్టించే ప్రయత్నాలను కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. వక్ఫ్‌ పై సరైన అవగాహన లేనివారూ ఆ చట్టంపై  చట్టంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు ఉన్నది సేవ చేయడానికేనని ఆయన స్పష్టం చేశారు. ఆ బోర్టులో ముస్లిములే ఉండాలని ఏం లేదని, ఇద్దరు ముస్లిమేతరులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు. ఇది మతానికి సంబంధించిన అంశం కాదని, అటువంటపుడు మతపరమైన అంశాలపై జోక్యంగా ఎలా భావిస్తారని ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం సవరణలో భాగంగా ప్రభుత్వం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ దేశవ్యాప్తంగా సుమారు 96 లక్షల మంది ముస్లింలను కలసి విచారించిందన్నారు.  అలా అందరి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని స్పష్టం చేశారు. 

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు