సుప్రీం కోర్టుకు కొత్త CJI.. బీఆర్ గవాయ్ తర్వాత ఆయనకే బాధ్యతలు!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తదుపరి CJI నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. జస్టిస్ సూర్య కాంత్ తదుపరి CJI సీనియారిటీ లిస్ట్‌లో ఉన్నారు.

New Update
_Justice Surya Kant

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సూర్య కాంత్ తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి సంప్రదాయాన్ని అనుసరించి, తదుపరి సీజేఐ పేరును సిఫారసు చేయవలసిందిగా ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్‌కి లేఖ రాశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలను నిర్దేశించే 'మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్' ప్రకారం, పదవిలో ఉన్న సీజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తినే వారసుడిగా సిఫారసు చేయాలి.

ఈ నియమావళి ప్రకారం, జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీ విరమణ తర్వాత సీనియారిటీ జాబితాలో జస్టిస్ సూర్య కాంత్ అగ్రస్థానంలో ఉన్నారు. దీంతో, దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం లాంఛనంగా పూర్తి కానుంది. జస్టిస్ సూర్య కాంత్ నవంబర్ 24న సీజేఐగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆయన ఫిబ్రవరి 9, 2027 వరకు దాదాపు 15 నెలల పాటు ఈ కీలక పదవిలో కొనసాగుతారు. జస్టిస్ సూర్య కాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, హర్యానా అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన పనిచేశారు. త్వరలోనే జస్టిస్ గవాయ్ సిఫారసును కేంద్రం రాష్ట్రపతికి పంపనుంది. 

Advertisment
తాజా కథనాలు