Justice BR Gavai CJI: నేడు సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ గవాయ్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేశారు.

New Update
Justice BR Gavai

Justice BR Gavai CJI

Justice BR Gavai CJI: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ గవాయ్‌ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా(CJI Sanjiv Khanna) మే 13న పదవీ విరమణ చేశారు. దీంతో నిన్నటితో ఆయన పదవీకాలం ముగిసింది. సంజీవ్‌ ఖన్నా కేవలం ఆరునెలలు మాత్రమే ఈ పదవీలో కొనసాగారు. అయితే, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కేవలం ఆరు నెలలు మాత్రమే సేవలందించారు.  

Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?

ప్రస్తుతం పదవీవిరమణ పొందిన సంజీవ్‌ ఖన్నా గతనెల 16న 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్ గవాయ్‌(Justice Bhushan R Gavai) పేరును ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాగా గవాయ్‌ పదోన్నతిపై 2019 మేన 24న సుప్రీంకోర్టుకు వచ్చారు. ఆయన ఈ ఏడాది నవంబర్‌ 23న తన పదవీ విరమణ చేయనున్నారు. అంటే సుమారు ఆరునెలలకు పైగా ఆయన ప్రధానన్యాయమూర్తిగా సేవలందించనున్నారు. 

Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్‌ కూడా మేమే

మహారాష్ట్రలోని అమరావతిలో1960 నవంబర్‌ 24న జన్మించిన  జస్టిస్ బీఆర్ గవాయ్‌ పూర్తిపేరు భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌. తొలిసారి 1985 మార్చి 16న బార్‌ కౌన్సిల్ లో సభ్యుడయ్యారు.2003  నవంబర్‌ 14న బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నది పొందారు. ఆ తర్వాత రెండేళ్లకు 2005 నవంబర్‌ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆయన పదోన్నతులన్నీ ఆయన జన్మనెలతో ముడిపడి ఉండటం గమనార్హం. ఆయన నవంబర్‌లో జన్మించగా అదే నవంబర్‌లో అదనపు జడ్జిగా, శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఇప్పుడు తన పదవీ విరమణ కూడా తన జన్మదినానికి ఒక రోజు ముందు అంటే నవంబర్‌ 23న చేయనున్నారు.

Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?


ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు వంటి అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనాలలో జస్టిస్‌ గవాయ్‌ సభ్యులుగా ఉన్నారు.  జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్ గవాయ్‌ కావడం విశేషం.

Also Read :  అఘోరీపై మరో కేసు.. లైంగిక దాడి చేసిందంటూ యువతి కంప్లైంట్!
  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు