ఫ్రీ బస్ బంద్.. | AP Govt Sensational Decision On Free Bus Scheme To Women | CM Chandrababu | RTV
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
నాగబాబును MLA కోటా ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా ప్రకటించడంపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు సెటైర్ వేశారు. డిప్యూటీ సీఎంను టార్గెట్గా చేస్తూ.. అన్నను దొడ్డిదారిన మంత్రివర్గంలోకి తీసుకురావడంలో ఘన విజయం సాధించిన తమ్ముడికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.