/rtv/media/media_files/2025/03/21/zmIDQ5k5HZYQxaGZu0Rw.jpg)
Varma Vs Nagababu
Varma vs Janasena: జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం రోజున పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అయితే నాగబాబు పిఠాపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేశారు. టీడీపీ కార్యకర్తలు జై వర్మ అంటూ నినాదాలు చేయగా... జై జనసేన అంటూ జనసేన శ్రేణులు నినాదాలు చేశారు.
Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?
పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతు దారుల కు నచ్చలేదు. తాజాగా ఎమ్మెల్సీ హోదా లో నాగబాబు పిఠాపురం వచ్చారు. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ సమయంలో టీడీపీ కేడర్ లో పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా అనే సందేహం మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు వర్మ టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. దీంతో, పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు.
Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతు దారుల నినాదాలకు జనసేన కేడర్ కౌంటర్ గా జై జనసేన అంటూ నినాదాలు చేసారు. పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకీ ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీలకు అంతు చిక్కటం లేదు. నాగబాబు వ్యాఖ్యలతో జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గ్యాప్ మరింత పెరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడుగా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం.. మంత్రిగానూ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించటం టీడీపీ కేడర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తరువాత క్రమేణా వర్మ - జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమ పడితే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పైన తాజాగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన నిలదీసి న కార్యకర్తలు.. వర్మ చెబితేనే పవన్ కు ఓటు వేసామని తేల్చి చెప్పారు.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 28.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన గొల్లప్రోలు మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీలు నాగబాబు, హరిప్రసాద్ గారితో కలసి ప్రారంభించారు. నంతరం గొల్లప్రోలు హెడ్ వాటర్ వర్క్స్ లో రూ. 65.24 లక్షలతో మంచినీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. పంప్‌హౌస్‌లో మోటార్ల పని తీరుని నాగబాబు పరిశీలించారు. అనంతరం గొల్లప్రోలు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ని ప్రారంభించారు. క్యాంటిన్‌లో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు.
Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!
జనసేన -టిడిపి పోటాపోటీ నినాదాల రచ్చ..
— RTV (@RTVnewsnetwork) April 4, 2025
ఎమ్మెల్సీ నాగబాబు రెండురోజుల పర్యటనలో తోలిరోజే చేదు అనుభవం,
పిఠాపురం నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన రాక తెలుసుకొని గొల్లప్రోలు చేరుకున్న వర్మ అనుచరులు.. #nagababu #MLC #Pithapuram… pic.twitter.com/nHVY2mHebY