BIG BREAKING: కాంగ్రెస్ నేతలు పాక్ ప్రేమికులు.. పహల్గామ్ ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు!

మత ప్రాతిపదికన 25 మందిని ఉగ్రవాదులు చంపినా కాంగ్రెస్‌ నాయకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. భారత్‌లో ఉంటూ పాక్‌ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని మండిపడ్డారు.

New Update
Pawan Kalyan

Pawan Kalyan

BIG BREAKING:  మత ప్రాతిపదికన 25 మందిని ఉగ్రవాదులు చంపినా కాంగ్రెస్‌ నాయకులు పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మండిపడ్డారు. భారత్‌లో ఉంటూ పాక్‌ను ప్రేమిస్తామని కొందరు కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.అలాగైతే ఆ దేశానికి వెళ్లిపోండి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నప్పటికీ తమది జాతీయ విధానమన్నారు. రేపు యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు.  ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నివాళులు అర్పించారు.  

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్‌ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

‘‘సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు?. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌కు వెళ్తే చంపేశారు. కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంతో నమ్మకంతోనే కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారన్నారు. నేను చాలా సార్లు ముస్లిం సమాజానికి చెప్పా. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్

 నేను జాతీయ సమస్యల గురించి మాట్లాడితే అవన్ని నీకెందుకు అని చాలామంది నవ్వారు. ఎక్కడో ఏదో జరిగితే మనకు ఎందుకులే అని చాలా మంది అనుకుంటారు. కానీ దేశ సరిహద్దుల భద్రత సరిగ్గా లేకపోతే వాటి ప్రకంపనలు ఎక్కడికైనా వెళ్తాయి. అందుకే నేను దేశం కోసం, దేశ భద్రత కోసం ఇంత తపన పడతాను అని పవన్‌ అన్నారు. సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు. నిరాయుధులతో యుద్ధం చేయకూడదని తెలిపారు.  కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఇలాంటి ఘటన జరిగిందన్నారు. ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

 


 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు