Nominated Posts: ఏపీలో 38 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన..ఏ పార్టీకి ఎన్నంటే ?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల కేటాయింపులు కొనసాగుతోన్నాయి. తాజాగా 38 నామినేటెడ్ పోస్టులు కేటాయించింది.అందులో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన నేతలకు ఈ పోస్టులు కట్టబెట్టింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ ఛైర్మన్లను ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

New Update
Market Committee

Market Committee

ఏపీలో నామినేటెడ్ పదవుల కేటాయింపు కొనసాగుతోంది. అందులో భాగంగా 38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల పేర్లను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏఏంసీ ఛైర్మన్ పదవుల్లో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ నేతలకు కేటాయించిందీ ప్రభుత్వం. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది.

Market Committee
Market Committee

Advertisment
Advertisment
తాజా కథనాలు